జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? ఈ హెయిర్ మాస్క్‌తో నేచురల్ హేర్ మీ సొంతం..

చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం లేదా మోడ్రన్ టచ్ ఇచ్చేందుకు హెయిర్ కలర్ వేయించుకోవడం సాధారణం అయిపోయింది.

Update: 2024-08-26 10:56 GMT
జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? ఈ హెయిర్ మాస్క్‌తో నేచురల్ హేర్ మీ సొంతం..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం లేదా మోడ్రన్ టచ్ ఇచ్చేందుకు హెయిర్ కలర్ వేయించుకోవడం సాధారణం అయిపోయింది. పింక్, బ్లూ, గోల్డ్, మెరూన్ రెడ్ కలర్స్ తో మరింత కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది నేటి యూత్. అయితే ఇలా చేయడం వల్ల అందంగా కనిపించినా.. హెయిర్ డల్, డ్రై, డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఈ హెయిర్ మాస్క్ లు ట్రై చేయమని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల హెయిర్ హెల్తీగా, చిట్లిపోకుండా ఉంటుందని చెప్తున్నారు. మరి ఎక్స్ పర్ట్స్ ఇచ్చే టిప్స్ ఏంటి? ఏ విధంగా యూజ్ చేయాలి? తెలుసుకుందాం.

హెయిర్ మాస్క్‌ జుట్టుకు లోతుగా పోషణను అందించేందుకు, రిపేర్ చేయడానికి రూపొందించబడిన ఇంటెన్సివ్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌. సాధారణ కండిషనర్ల మాదిరిగా కాకుండా.. హెయిర్ మాస్క్‌లు ఎక్కువ కాన్సంట్రేషన్ తో ఉంటాయి. నిర్దిష్ట జుట్టు సమస్యలను పరిష్కరించడానికి తేమ, బలం, సంరక్షణను అందిస్తాయి. హెయిర్ కలర్ వేయడం వల్ల పొడిగా మారిన జుట్టును హైడ్రెట్ చేస్తాయి. చివర్లు విరిగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కెమికల్ ట్రీట్‌మెంట్స్, హీట్ స్టైలింగ్ వల్ల జరిగిన డ్యామేజ్‌ని రిపేర్ చేస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల నేచురల్ షైన్, సిల్కీ టెక్చర్ తిరిగి పొందడంతోపాటు.. చింపిరిగా కాకుండా హెయిర్ స్మూత్ గా, ఈజీగా మేనేజ్ చేసేలా ఉంటాయి.

కొబ్బరి నూనె, తేనె

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం చక్కగా అప్లయ్ చేసి.. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

అవకాడో,ఆలివ్ ఆయిల్

పండిన అవకాడోను మెత్తగా చేసి, దీనికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె అయిల్ కలపండి. దీంతోపాటు పాచౌలీ ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేయండి. ఈ మాస్క్‌ను అప్లై చేసేటప్పుడు జుట్టు చివర్లపై కూడా దృష్టి పెట్టండి. అప్లయ్ చేశాక ముప్పై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రం చేయండి. ప్రతి రెండు వారాలకు ఈ హెయిర్ మాస్క్‌ని అప్లై చేస్తే రిజల్ట్ అమేజింగ్ గా ఉంటుంది.

అరటి పండు, పెరుగు

ఒక పండిన అరటిపండును రెండు టేబుల్ స్పూన్ల పెరుగుతో కలపండి. తర్వాత రోజ్మేరీ ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేసి.. చక్కగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. 20 నిమిషాలు ఉన్నాక పూర్తిగా శుభ్రం చేసుకోండి. జుట్టు చిట్లకుండా ఉండటానికి వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, నిమ్మకాయ

టేబుల్ స్పూన్ నిమ్మరసానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై కడిగేయండి, ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇలా చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

గ్రీన్ టీ, కొబ్బరి నూనె

ఒక కప్పు గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుని.. దానిని చల్లబరచండి. ఆ తర్వాత దానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమంలో రెండు చుక్కల రోజ్మేరీ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి.. 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై శుభ్రం చేసుకోండి. ప్రతి రెండు వారాలకు ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు.

వోట్మీల్, ఆల్మండ్ ఆయిల్

రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ వోట్మీల్, రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనెతో కలపండి. దీనికి లావెండర్ నూనె చుక్కలను జోడించండి. ఈ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ని మీ వెంట్రుకలకు అప్లై చేసి, 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత బాగా కడిగేయండి. వారానికోసారి ఈ హెయిర్ మాస్క్‌ని వాడమని అంటున్నారు నిపుణులు.

నోట్ : హెయిర్ మాస్క్ మీ జుట్టును మరింత అందంగా, ఆరోగ్యంగా మార్చగలవు. కానీ ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News