ఈ యోగాసనాలతో జుట్టు పెరుగుదల ఖాయం..!
యోగా ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: యోగా ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. జీవన శైలిలో మార్పుల కారణంగా మనుషులు అనేక రోగాల పాలవుతున్నారు. ఈ సమస్యలను నివారించేందుకు పురాతన భారతీయ పద్ధతైన యోగాను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో హెయిర్ లాస్ ఒకటి. జుట్టు రాలడాన్ని, జుట్టు పెరుగుదలకు యోగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినే ఆహారంపై ఎవ్వరూ శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీని కారణంగా జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. టీవీల్లో వచ్చే అనేక ప్రకటనలను చూసి హెయిర్‌కు ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ను వాడుతారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా జుట్టు చీలిపోవడం, రాలిపోవడం, తెల్లగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టును మళ్లీ ఒత్తుగా, మృదువుగా మార్చడానికి, హెయిర్ సమస్యలు ఆటోమేటిక్‌గా తగ్గిపోవడానికి కొన్ని యోగాసనాలే ఉపయోగపడతాయి. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల బాడీలోని ఇతర భాగాలతో పాటు మెదడులో రక్త ప్రవాహం కూడా మెరుగ్గా జరుగుతుంది. దీంతో మీకు హెయిర్ పెరుగుదల కనిపిస్తుంది. అలాగే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ భంగిమలో 1 నుంచి 2 నిమిషాలు ఉండండి. ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేయండి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇక మీ జుట్టు మృదువుగా, పొడవుగా మారిపోతుంది.
ఇవి కూడా చదవండి:
రోజుకో ఉల్లిపాయ తింటే చాలు.. నెలసరి సమస్యలు దూరం
నెయ్యితో అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్.. ఇలా ట్రై చేయండి..