మగాళ్లూ.. శృంగారం చేసేటప్పుడు మీ పార్ట్‌నర్‌తో ఈ తప్పు మాత్రం చేయకండి..

దాంపత్య జీవితంలో ఇద్దరి మనసులు, అభిరుచులు కలవడం ఎంత తృప్తినిస్తుందో.. ఇద్దరి శరీరాలు కలిసినప్పుడు కూడా అంతే ఆనందం కలగాలి.

Update: 2023-08-14 12:41 GMT

దిశ, ఫీచర్స్: దాంపత్య జీవితంలో ఇద్దరి మనసులు, అభిరుచులు కలవడం ఎంత తృప్తినిస్తుందో.. ఇద్దరి శరీరాలు కలిసినప్పుడు కూడా అంతే ఆనందం కలగాలి. అప్పుడే వాళ్ల కాపురం సవ్యంగా సాగుతున్నట్లు. అయితే శృంగారాన్ని జీవిత భాగస్వాములిద్దరూ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. సెక్స్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీ భాగస్వామి (పార్ట్‌నర్‌) మూడ్ మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగితే రిలేషన్‍పై కూడా ప్రభావం పడుతుంది. మరీ శృంగారం చేసే సమయంలో పురుషులు చేయకూడని తప్పులేంటో చూద్దాం.

* సెక్స్ చేస్తున్న సమయంలో మీ పార్ట్‌నర్‌తో ఇతర మహిళల గురించి అగౌరవంగా మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల మీ పార్ట్‌నర్ మూడ్ ఆఫ్ అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇతర మహిళల గురించి చెడుగా మాట్లాడితే తమ రిలేషన్‍ గురించి కూడా అనుమానాలు పెంచుకుంటారు. అందుకే శృంగారం సమయంలో పురుషులు నెగెటివ్‍గా మాట్లాడకపోవడమే మంచిది.

* చాలా మంది పురుషులు తమ భాగస్వామి కంటే తమకే సెక్స్ గురించి ఎక్కువ తెలుసని అనుకుంటారు. అలా శృంగారంలో తమ ఇష్టాన్ని మహిళపై రుద్దుతారు. ఇక వారికి కూడా అదే నచ్చుతుందని అనుకుంటారు. కానీ శృంగారం ఎలా చేయాలనుకుంటున్నారనేది ముందుగా భాగస్వామికి చెప్పాలి. ఎలా కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఇద్దరికీ సంతృప్తి కలుగుతుంది.

* మహిళ శరీరంలో కొన్ని కొన్ని భాగాలు చాలా సెన్సిటివ్‍గా ఉంటాయి. వాటిని పురుషుడు సాఫ్ట్‌గా సున్నితంగా టచ్ చేయాలి. అలాకాకుండా హార్డ్‌గా వ్యవహరిస్తే బాధతో చిరాకు, కోపం వచ్చే అవకాశం ఉంది. దీంతో కూడా మూడ్ ఆఫ్ అయ్యే చాన్స్ ఎక్కువ.

* శృంగారానికి ముందు ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. అయితే, మహిళ సెక్స్ కోసం పూర్తిగా సిద్ధమయ్యేందుకు కాస్త ఎక్కువ సేపే పురుషుడు ఫోర్‌ప్లే చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఫిజికల్ కాంటాక్ట్ పెరుగుతుంది. ఆమె శరీరం మొత్తం ఎనర్జీ వస్తుంది. అందుకే ఫోర్‌ప్లేను గబగబా ముగించకుండా కాస్త ఎక్కువ సేపు సాగిస్తే బెటర్.

* ఇక కొంతమంది పురుషులు శృంగారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. పార్ట్‌నర్‌ ఎలా ఫీలవుతుందో కూడా పట్టించుకోకుండా అగ్రెసివ్‍గా చేస్తుంటారు. ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. ఇలా ఇష్టాన్ని తెలుసుకోకుండా, ర్యాష్‌గా ప్రవర్తిస్తే వారు హ్యాపీగా ఉండలేరు. అందుకే శృంగారంలో దూకుడుగా వ్యవహరించకుండా ముందుగా తమ పార్ట్‌నర్‌తో ఇంటి విషయాలు కాసేపు మాట్లాడి నెమ్మదిగా తమ పని తాము చెసుకుంటే మహిళ కూడా ఆనందంగా, ఎలాంటి ఇబ్బంది పడకుండా మీతో ఉంటుంది.

* ముఖ్యంగా బెడ్‌ రూమ్ విషయంలో జగ్రతగా ఉండాలి. ఎప్పుడు నీట్‌గా సర్దుకోవాలి. శృంగారం సజావుగా సాగేందుకు ఇది చాలా ముఖ్యం. గదిలో దుస్తులు, ఇతర వస్తువులు, కొన్ని రకాల ఫొటోలు ఎక్కడపడితే అక్కడ ఉంటే వీటిని చూసినప్పుడు మూడ్ ఆఫ్ అయ్యే చాన్స్ ఉంటుంది. అందుకే సెక్స్‌కు ముందే రూమ్‍ను సరిగ్గా సర్దుకోవడం పురుషుడి పని కూడా.

ఇవి కూడా చదవండి : సడెన్‌గా ఆ సింప్టమ్స్ కనిపిస్తున్నాయా?.. లోబీపీ కావచ్చు

Tags:    

Similar News