పచ్చి మిర్చితో మానసిక ఆరోగ్యం

పచ్చి మిర్చి వినియోగానికి చాలా మంది దూరంగభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయని అనుకుంటారు. అందుకే ఎండు కారం పొడికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

Update: 2024-07-15 17:08 GMT

దిశ, ఫీచర్స్: పచ్చి మిర్చి వినియోగానికి చాలా మంది దూరంగభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయని అనుకుంటారు. అందుకే ఎండు కారం పొడికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందని సూచిస్తున్నారు.

జీవక్రియ పెరుగుదల : పచ్చి మిరపకాయల మంటకు కారణమయ్యే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియ రేటును.పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది. థర్మోజైనిస్ ను ప్రోత్సహించే క్యాప్సైసిన్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. తిన్న తర్వాత కేలరీలను బర్న్ చేస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంపు : మిరపకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. శ్వాస కోశ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది. కడుపులో ఆమ్ల స్రావాన్ని తగ్గించి అల్సర్లు రాకుండా కాపాడుతుంది.

గుండె ఆరోగ్యం : పచ్చి మిర్చిలోని పొటాషియం, విటమిన్ ఎ రక్తపోటు నియంత్రణ, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ : ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరుకు తోడ్పడుతుంది.మలబద్ధకాన్ని తగ్గించి.. ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. డైటరీ ఫైబర్ ప్రేగు క్రమబద్ధతను నిర్వహిస్తుంది. జీర్ణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు : క్యాప్సైసిన్ మిరపకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పని చేస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గించి.. నొప్పి నివారిణిగా పని చేస్తుంది. శరీరంలో వాపును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యం : స్పైసీ ఫుడ్ ఎండార్ఫిన్లు విడుదలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా మానసిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ : పచ్చి మిరపలో విటమిన్ ఎ, విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే ఫైటోన్యూట్రియెంట్లు ( ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్) ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. సెల్యులార్ ఆరోగ్యం, దీర్ఘాయువుకు దోహదం చేస్తాయి. క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Similar News