సేల్‌కు ముందే ఫోన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎందుకంటే?
జనవరి 2023 నుంచి భారతదేశంలో విక్రయించే ముందు అన్ని మొబైల్ కంపెనీలు ఫోన్లకు సంబంధించిన IMEI నంబర్‌ను తమ యాంటీ కౌంటర్‌ఫీటెడ్(నకిలీ వ్యతిరేక), లాస్ట్ హ్యాండ్‌సెట్ బ్లాకింగ్ పోర్టల్‌లో నమోదు చేయడాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసింది.
దిశ, ఫీచర్స్ : జనవరి 2023 నుంచి భారతదేశంలో విక్రయించే ముందు అన్ని మొబైల్ కంపెనీలు ఫోన్లకు సంబంధించిన IMEI నంబర్‌ను తమ యాంటీ కౌంటర్‌ఫీటెడ్(నకిలీ వ్యతిరేక), లాస్ట్ హ్యాండ్‌సెట్ బ్లాకింగ్ పోర్టల్‌లో నమోదు చేయడాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసింది. దీంతో స్థానికంగా తయారైన లేదా దిగుమతి చేయబడిన అన్ని ఫోన్లు కూడా రిజిస్టర్ చేయబడటంతో పాటు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా నిర్వహించబడే ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రిస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి IMEI సర్టిఫికెట్స్ పొందవలసి ఉంటుంది. మొబైల్ డివైజ్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్(సవరణ) రూల్స్, 2022లోని ప్రివెన్షన్ ఆఫ్ ట్యాంపరింగ్ కింద నోటిఫికేషన్ జారీ చేయబడింది.
ఇది ఎందుకు ముఖ్యమైనది?
సాధారణంగా మొబైల్ ఫోన్లు ప్రత్యేకమైన 15-అంకెల IMEI నంబర్‌తో వస్తాయి. ఇది సదరు పరికరానికి ప్రత్యేక IDగా పనిచేస్తుంది. నెట్‌వర్క్‌లలో ఒకేవిధమైన IMEI నంబర్లతో అనేక నకిలీ పరికరాలను రూపొందించడం వలన కోల్పోయిన ఫోన్లను ట్రాక్ చేయడంలో అసమర్థతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కాగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను కనుగొనడంలో, నిరోధించడంలో సాయపడేందుకు ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను ప్రారంభించింది. అలాగే అటువంటి పరికరాల వ్యాప్తిని ఆపడానికి ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రిస్ట్రిక్షన్ సిస్టమ్‌ను జోడించారు.
ప్రస్తుతానికి ఈ పోర్టల్.. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న ఫోన్‌ల సౌకర్యాలను మాత్రమే బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే CEIR ప్రాజెక్ట్.. నకిలీ పరికరాల సమస్యను కూడా పరిష్కరించడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ల సమస్యను పరిష్కరించే పనిలో ఉంది. ఈ నోటిఫికేషన్ అమలులో ఉన్నందున, భారతదేశంలోకి దిగుమతి చేసుకున్న పరికరాల IMEI నంబర్‌లను కూడా IDCR సిస్టమ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక IDCR జనవరి 2020 నుంచి ఆచరణలో ఉంది. ఇక్కడ IMEI సర్టిఫికెట్స్‌ను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు, రూపొందించవచ్చు. ఇది ప్రైవేట్ సంస్థ అయిన మొబైల్ స్టాండర్డ్ అలయన్స్ ఆఫ్ ఇండియా(MSAI) ద్వారా నిర్వహించబడే పాత IMEI రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను భర్తీ చేసింది.
ఇవి కూడా చదవండి :
బ్రేకింగ్ న్యూస్.. జాతీయ పార్టీ ప్రకటనపై కేసీఆర్ సంచలన నిర్ణయం