బంగారు బుల్లెట్.. ప్రత్యేకతలు ఇవే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటేనే యువతలో బాగా క్రేజ్ ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్ : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటేనే యువతలో బాగా క్రేజ్ ఉంటుంది. ఎన్‌ఫీల్డ్ బైక్ పై కొందరు ప్రపంచాన్నే చుట్టి వస్తారు. ఎంతైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై తిరుగుతుంటే ఆ ఆనందమే వేరు అంటారు కుర్రకారు.. అయితే ఓ బంగారు బుల్లెట్ బైక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరుకి గోల్డ్ బుల్లెట్ అయినా ఇది బంగారంతో తయారు కాలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది.
నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్స్, హెడ్యాంప్ కక్షర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్ ఎగువ భాగంలో చూడవచ్చు. అంతే కాకుండా ఫుట్రస్ట్లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్లో ఉన్నాయి. ఇక ఈ బైక్ హ్యాండిల్ బార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ లాంటిది చూడవచ్చు. ఇది కూడా గోల్డెన్ షెడ్ లోనే ఉంది. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం.
Read More: మనిషి చెడిపోకుండా ఉండాలంటే తాబేలు నుంచి నేర్చుకోవాల్సింది ఇదే..