Gold Rates : మహిళలకు శుభవార్త.. తులం బంగారం రూ. 113 మాత్రమే...

బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో. కనీసం ఒక్క గ్రాము గోల్డ్ అయిన ఒంటి మీద ఉండాలని కోరుకుంటారు. ఇక ఫంక్షన్స్ అయితే పరపతి, హోదా చూపించుకునేందుకు ఆభరణాలు వేసుకుని

Update: 2024-07-25 06:18 GMT

దిశ, ఫీచర్స్: బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో. కనీసం ఒక్క గ్రాము గోల్డ్ అయిన ఒంటి మీద ఉండాలని కోరుకుంటారు. ఇక ఫంక్షన్స్ అయితే పరపతి, హోదా చూపించుకునేందుకు ఆభరణాలు వేసుకుని ఇతరుల ముందు గొప్పలు పోవడంలో ముందుంటారు. ఇక పాజిటివ్ ఏంటంటే.. కష్టాలు వచ్చినప్పుడు ముందుగా ఆదుకునేది ఇలా అప్పుడప్పుడు కొనుక్కున్న బంగారమే. కాగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటాయి. బడ్జెట్ ఎఫెక్ట్ తో మూడు నుంచి నాలుగు వేలు తగ్గి ప్రస్తుతం 70వేలు ఉండగా.. 1959లో బంగారం ధర ఎంత ఉండేదో వైరల్ అవుతుంది.

1959లో తులం బంగారం అంటే 12 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 113 మాత్రమే. కాగా ఇందుకు సంబంధించిన బిల్లు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం చాక్లెట్ కన్నా చీప్ అంటున్నారు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అప్పుడు జీతాలు కూడా అలాగే ఉండేవని చెప్తున్నారు. రూ. 250 నుంచి రూ. 500 మధ్య శాలరీ ఉండేదని.. అప్పుడు ఆ రేట్ చాలా ఎక్కువని అంటున్నారు. ఇప్పుడు ఈ రేటు మహిళలకు శుభవార్త కావచ్చు కానీ అప్పుడు మాత్రం కొనడం కష్టమే అని చెప్తున్నారు.

(Content Credits Upsc World official)


Similar News