గ్లోయింగ్ స్కిన్ కోసం వంటింట్లో ఉండే వాటితో ఇలా చేయండి..!
ప్రతీ అమ్మాయికి అందంగా ఉండాలనే కోరిక ఉంటుంది.
దిశ,ఫీచర్స్: ప్రతీ అమ్మాయికి అందంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకు మార్కెట్‌లోని వివిధ రకాల బ్యూటీ ప్రొడెక్ట్‌లను వాడుతుంటారు. అందులో ఉండే రసాయనాలు కొంతసేపటి తరువాత చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అయితే, ఇంట్లో ఉండే కొన్ని పదార్ధాలు ముఖంపై మెరుపును పెంచేందుకు ఉపయోగపడతాయి. ఇది ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి.
* టమాటా, పెరుగు: టమాటా గుజ్జులో కొంచెం పెరుగు, తేనె కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఫేస్‌ని నీటితో శుభ్రంగా కడిగిన తరువాత ఈ ప్యాక్‌ని ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ట్యాన్ తొలగిపోతుంది.
* పెరుగు, శనగపిండి: శనగపిండి, పెరుగు కూడా చర్మానికి మేలు చేస్తుంది. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగించి, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ముందుగా శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు మిశ్రమాన్ని కలపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి స్క్రబ్‌లా మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
* అరటిపండు, తేనె: సగం అరటిపండులో టీ స్పూన్ తేనెను కలిపి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. అరటిపండు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అదేవిధంగా తేనె చర్మాన్ని మెరిపించడంతోపాటుగా తేమను అందించడంలో సహాయపడుతుంది.