పొంచి ఉన్న ముప్పు.. 2030 నాటికి ఆర్కిటిక్ మహా సముద్రం మంచు రహితంగా మారుతుందా?

గ్లోబల్ వార్మింగ్.. హీట్ వేవ్.. క్లైమేట్ చేంజ్.. పేరు ఏదైనా ప్రభావం మాత్రం ఒక్కటే.

Update: 2023-07-22 08:26 GMT

దిశ, ఫీచర్స్: గ్లోబల్ వార్మింగ్.. హీట్ వేవ్.. క్లైమేట్ చేంజ్.. పేరు ఏదైనా ప్రభావం మాత్రం ఒక్కటే. ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకునే క్రమంలో మానవులు పర్యావరణాన్ని, భవిష్యత్ జీవన మనుగడను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళన ఇప్పటికే వ్యక్తం అవుతోంది. యూరప్‌లో వేడివాతావరణం కారణంగా, మరికొన్ని దేశాల్లో వరద బీభత్సం కారణంగా ఇటీవల ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

మానవాళిని ఆందోళనకు గురిచేయడమేగాక, పర్యావరణానికి హానిచేసే మరో ప్రమాదకర దృశ్యం 2030 నాటికి ఆవిష్కృతం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేంటంటే.. ఎప్పటికీ మంచు పరిసరాలతో పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తున్న ఆర్కిటిక్ మహా సముద్రం మంచు రహితంగా మారుతుందట. రోజు రోజుకూ వాతావణంలో వస్తున్న మార్పులు, విడుదలవుతున్న ప్రమాదకర ఉద్గారాలే ఇందుకు కారణమని చెప్తున్నారు.

వాస్తవానికి క్లైమేట్ సేఫ్టీపై స్పృహ ఉన్నప్పటికీ, ఒక కచ్చితమైన విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయకపోవడం ఈ పరిణామాలకు దారితీసిందని పరిశోధకులు అంటున్నారు. ఉద్గారాలను తగ్గించడానికి ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రయత్నించినా 2030 నాటికి ఆర్కిటిక్ మహా సముద్రం మంచు రహితంగా మారడం ఆగకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Similar News