Mosquitoes: కెమికల్స్‌తో పని లేకుండా దోమలను ఈ విధంగా తరిమేయండి!
సాధారణంగా ఇంట్లోకి దోమలు వస్తూనే ఉంటాయి.
దిశ,వెబ్ డెస్క్ : సాధారణంగా ఇంట్లోకి దోమలు వస్తూనే ఉంటాయి. గ్రామాల్లో పంటలు, నీటి నిల్వ ఎక్కువ కాబట్టి ఈ సమస్య మరీ ఎక్కువ. దోమ అనేక రకాల రోగాలను రావడానికి కారణమవుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి ప్రాణాంతక జ్వరాలు వస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.
1. కర్పూరం కలిపి నూనెలో వేసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. రాత్రి పడుకునే ముందు ఈ దీపం వెలిగించి.. తలుపులు మూయాలి. ఇలా చేస్తే దోమలు బెడద తగ్గుతుంది.
2. మూడు చెంచాల వేప నూనెలో ఒక స్పూన్ కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యానీ ఆకులపై ఈ నూనె రాయాలి. దోమలు ఎక్కువగా ఉన్న చోట ఈ బిర్యానీ కాల్చి పెట్టాలి.
3. వేప నూనెలో నాలుగువెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లలో 15 నిమిషాలు మరగబెట్టాలి. దోమలు బాగా బాగా ఉన్న చోట దీన్ని చల్లుతూ ఉండండి. దోమలన్ని చనిపోతాయి.