మంచి ఆరోగ్యం కోసం.. వీటిని పాటిస్తే చాలు

ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.

Update: 2023-07-16 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్: మనకి భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. దేవుడిని ఎంత ప్రార్ధించినా మీ అలవాట్లు బాగా లేకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1.ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం తినండి.

2. ఉప్పు, పంచదార తక్కువగా తీసుకోవాలి.

3. హానికరమైన మద్యపాన వాడకాన్ని నివారించండి.

4. ధూమపానం చేయవద్దు.

5. మీ రక్త పోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి.

6. సురక్షితమైన నీటిని మాత్రమే తాగండి.

7. తినే ముందు, బయటికి వెళ్లి వచ్చిన మీ చేతులు, కాళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోండి.

8. రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు చాలా మంచిది.

9. యాలకులతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగిస్తుంది.

10. బరువును తగ్గించేందుకు కరివేపాకులు చాలా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఇవి తొలగిస్తాయి.

11. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా కరిగిస్తాయి.

12. బరువును తగ్గించేందుకు క్యాబేజీ మంచిగా పని చేస్తుంది. క్యాబేజీని ఎక్కువ తినే వారిలో కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: స్కిన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్‌ అందాన్ని పెంచుతాయా?.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు


Similar News