ఎండలు మండిపోతున్నాయి.. పొట్టలో చల్లగా ఉండాలంటే ఈ ఫుడ్ ఆరగించాల్సిందే.. !
వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండతీవ్రతను తట్టుకునేందుకు చల్లచల్లగా ఏదో ఒకటి తినాలని, చల్లని పానియాలు తాగాలని, నీడపట్టున ఉండాలని అనుకుంటాం.
దిశ, ఫీచర్స్ : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండతీవ్రతను తట్టుకునేందుకు చల్లచల్లగా ఏదో ఒకటి తినాలని, చల్లని పానియాలు తాగాలని, నీడపట్టున ఉండాలని అనుకుంటాం. అయితే కొంత మంది ఎండలో పనిచేయడం వల్లనో, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వల్లనో డీహైడ్రేషన్ కు లోనవుతూ ఉంటారు. అయితే డీ హైడ్రేషన్ నుంచి బయట పడటానికి పెరుగు ఎంతో దోహదపుడుతుంది. అంతే కాక పెరుగుతో చేసే మజ్జిగ మనిషిశరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పెరుగన్నంలో ఉండే ఎలక్ట్రోలైట్‌లు డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాదు పెరుగన్నాన్ని సులభంగా జీర్ణించుకోగలం. పెరుగన్నాన్ని తీసుకుంటే అది కడుపులో ఎంతో తేలికగా ఉంటుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ప్రతిమనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అందుకే చాలావరకు రోగులకు డైట్ లో పెరుగన్నాన్ని ఇస్తూ ఉంటారు.
పెరుగన్నంలో ఉండే ప్రోటీన్, కాల్షియం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా అతిసారం వంటి జీర్ణశయాంతర సమస్యలను పెరుగన్నంలో ఉండే ప్రోబయోటిక్స్ దూరం చేస్తాయి. పెరుగన్నంలో బఠానీలు లేదా మొక్కజొన్నలు, తురిమిన క్యారెట్లు, బీన్స్ కలపడం వల్ల పోషక విలువలు మరింత పెరుగుతాయి. వాటితోపాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకుంటే రుచి మరింత అమోఘంగా ఉంటుంది. ఈ వేసవికాలంలో ఇలా పెరుగన్నాన్ని తిని, ప్రతిరోజు మజ్జిగను తాగుతూ పోతే శరీరంలో ఉండే వేడి తగ్గి, బాడీ డీహైడ్రేషన్ కాకుండా బయటపడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వేసవిలో చల్లని పెరుగు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..