వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ టిప్స్ పాటించండి

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరూ హెల్దీగా ఉండటానికి ఎన్నో హెల్త్ టిప్స్ పాటిస్తుంటారు. అయితే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

Update: 2024-02-04 07:59 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరూ హెల్దీగా ఉండటానికి ఎన్నో హెల్త్ టిప్స్ పాటిస్తుంటారు. అయితే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన నీతి శాస్త్రంలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలిపాడు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాగే ఒక వ్యక్తి ఆరోగ్యానికి మించిన గొప్ప సంపదలేదంటారు. అయితే కొన్ని నిర్ధిష్ట నియమాల ద్వారా ఆరోగ్యంగా ఉండి జీవితంలో అనేక విజయాలు సొంతం చేసుకోవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కరోనా, క్యాన్సర్ లాంటి వ్యాధులు పంజా విసురుతున్నాయి. అనేక కొత్త కొత్త అంటు వ్యాధులతో ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యుద్ధమే చేయాల్సి వస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి తన హెల్త్‌ను సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఈ టిప్స్ పాటించాలి అంటున్నారు ఆచార్య చాణక్యుడు.

ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం శరీరానికి మంచిదంట. అలాగే రోజు ఉదయం పరగడుపున లీటర్ నీళ్లు తాగడం ద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.అలాగే తృణధాన్యాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తృణధాన్యాలు తినడం వలన జీర్ణవ్యవస్థ బలపడి ఆరోగ్యంగా ఉంటారంట. అంతే కాకుండా ఆహారం ఎప్పుడు తిన్నా.. ఫ్రైగా కాకుండా రసం లాంటిది కలుపుకొని తినాలంట. ఇలా తినడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వందేళ్లు సంతోషంగా జీవించవచ్చు అంటున్నాడు చాణక్యుడు.

Tags:    

Similar News