తండ్రి అయితే తగ్గుతున్న ఆయుష్షు

తండ్రి అయితే ఆయుష్షు తగ్గిపోతుందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. పిల్లలను చూసుకోవడంలో తలెత్తుతున్న ఒత్తిడి.. వయసు మీద పడుతున్నా కొద్ది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని

Update: 2024-06-02 15:33 GMT

దిశ, ఫీచర్స్: తండ్రి అయితే ఆయుష్షు తగ్గిపోతుందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. పిల్లలను చూసుకోవడంలో తలెత్తుతున్న ఒత్తిడి.. వయసు మీద పడుతున్నా కొద్ది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని వివరించింది. నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ, ఆన్ & రాబర్ట్ హెచ్. లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ చికాగో సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. 45-84 ఏళ్ల మధ్య ఉన్న 2814 మంది పురుషులను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పిల్లలు ఉన్న వారు పిల్లలు లేని వారి కంటే ఎక్కువగా గుండె పోటుకు గురవుతున్నారని తెలిపారు.

AJPM ఫోకస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. పేరెంట్‌హుడ్‌తో వచ్చే అదనపు బాధ్యతలు, ఒత్తిళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తినడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం తండ్రులకు అసాధ్యం అవుతుంది. పిల్లలు ఉండటం వల్ల అతని సమయం, డబ్బు, ఆహారం పూర్తిగా వారికే కేటాయించాల్సి వస్తుంది. దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు లేని వారితో పోలిస్తే పిల్లలను కలిగి ఉన్నవారు హృదయనాళ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఆహారం, వ్యాయామం, ధూమపానం, బరువు, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వంటి అంశాలను పరిశీలించడం ద్వారా ఇది నిర్ణయించబడింది.


Similar News