Fashion:జడ బిల్లలు కాదండోయ్.. మీ జుట్టు అందంగా కనిపించాలంటే ఇవి పెట్టుకోవాలంట!

ప్రస్తుతం ఫ్యాషన్ కొంత పుంతలు తొక్కుతుంది. కొత్త కొత్త డిజైన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లీలంటే జడ బిల్లలు ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. జడకు పెట్టుకునేందుకు

Update: 2024-07-20 09:28 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఫ్యాషన్ కొంత పుంతలు తొక్కుతుంది. కొత్త కొత్త డిజైన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లీలంటే జడ బిల్లలు ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. జడకు పెట్టుకునేందుకు మరో కొత్తరకం ఆభరణాలు మార్కెట్‌లోకి వచ్చాయి, అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరిగిన విషయంతెలిసిందే. ఈ వివాహా వేడుకలో ప్రతి ఒక్కరూ కొత్త కొత్త ఫ్యాషన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

రాధిక మర్చంట్, ఇషా అంబానీ,కృతిసనన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షనాయా కపూర్ వీరందరూ తమ డిఫరెంట్ జడ బిల్లలతో అదరి దృష్టినీ ఆకర్షించారు. ముఖ్యంగా రాధక మర్చంట్ జడ బిల్ల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మల్టీకలర్ లెహంగా వేసుకున్న రాధిక జడకు తమ అమ్మ నగల్లో ఒకటైన జడ బిల్లను పెట్టారు. ఇది డిఫరెంట్‌గా స్టైలిష్ లుక్‌లో కపించి అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఇషా అంబానీ, జడ కూడా స్పెషల్‌గా కనిపించింది. ఆమె మొదట తన కొప్పులో పూలు పెట్టుకోగా, తర్వాత జడ పొడువూ.. వజ్రాలు, వర్క్, పచ్చలు, రూబీలతో తయారు చేసిని అందమైనపూల జడను వేసుకుంది. అంతే కాకుండా జడ కింద కొప్పులుకూడా ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అందంగా ఉంది.

కృతిసనన్,బంగారం, పోల్కి డిజైన్ తో పూల జడతో మెరవగా, జాక్వెలిన్ పోల్కీ వర్క్ ముత్యాలు, జెబ్ స్టోన్స్‌తో చేసిన పూల జడతో మెరిసిపోయింది. అలాగే,షనాయా కపూర్ కూడా డిఫరెంట్ స్టైల్ పూల జడతో అందరనీ ఆకట్టుకుంది.

Tags:    

Similar News