రైళ్లలో అమర్చిన ఫ్యాన్లకు ఓ స్పెషలిటీ ఉంది.. అందుకే రైళ్లలో ఎవరూ అది చేయలేరు

ఇండియన్ రైల్వే రైళ్లలో ప్రయాణికులు సులభంగా ప్రయాణం చేయడానికి వీలుగా అనేక ఏర్పాట్లను చేస్తుంది.

Update: 2023-06-27 16:37 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ రైల్వే రైళ్లలో ప్రయాణికులు సులభంగా ప్రయాణం చేయడానికి వీలుగా అనేక ఏర్పాట్లను చేస్తుంది. టాయిలెట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లైట్లు కూడా అమరుస్తుంది. వీటితో పాటు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా చార్జింగ్ పాయింట్స్ ను కూడా రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైళ్లలో స్లీపర్ క్లాసులు, జనరల్ బోగిలలో ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్ లను ఏర్పాటు చేసే విషయం తెలిసిందే.

ఇవి ప్రయాణ సమయంలో వేడి నుంచి చెమట నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే రైల్వే ఫ్యాన్లు దొంగతనం చేసినట్టు ఎప్పుడైనా వార్తలు విన్నారా..? ఖచ్చితంగా విని ఉండరు. ఎందుకంటే రైళ్లలో ఏర్పాటు చేసే ఫ్యాన్లు దొంగతనం చెయ్యలేరు. దాని వెనుక ఉన్న సాంకేతికత అటువంటిది. రైళ్లలో అమర్చిన ఫ్యాన్లు రైళ్లలో మాత్రమే పనిచేస్తాయి. ఈ ఫ్యాన్ లను రైళ్ల నుంచి బయటకు తీసి ఇళ్లల్లో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే అవి అసలు పని చేయవు.

Read More:   30 ఏళ్లకే ఆ సమస్య వస్తుందా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే! 

Tags:    

Similar News