తెలివితేటలను పెంచే యోగాసనాలివే.. చదువుకునే పిల్లల్లో ఏకాగ్రతనూ పెంచుతాయ్
ఒక వైపు పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు రాబోయే అకడమిక్ ఇయర్‌లో వారి చదువుల గురించి ఆలోచిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ చిన్నారులు యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటారు.
దిశ, ఫీచర్స్ : ఒక వైపు పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు రాబోయే అకడమిక్ ఇయర్‌లో వారి చదువుల గురించి ఆలోచిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ చిన్నారులు యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే అందుకు కొన్ని యోగాసనాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయాలంటే పెద్దలు, పిల్లలు వాటిని ప్రయత్నించవ్చని చెప్తున్నారు. అవేమిటో చూద్దామా మరి.
వక్రాసనం : ఈ యోగాసనం వల్ల మెదడుకు రక్త సరఫరాలో ఆటంకాలు తొలగిపోతాయి. యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. పిల్లలు దీనిని ప్రాక్టీస్ చేయడంవల్ల తెలివితేటలు పెరుగుతాయి. ఇక ఎలా వేయాలంటే.. నేలమీద నిటారుగా నిలబడి, కాళ్లు తిన్నగా చాచాలి. ఒక కాలిని మడిచి, పక్కకు తీసి దానిపాదం మరరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి. అలాగే ఏ కాలు అయితే వంచుతారో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. ఇలా మొదటి కాలితో అయ్యాక, రెండవ కాలితోనూ ప్రయత్నించాలి. దీనివల్ల ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి.
వృక్షాసనం : మెదడును ఉత్తేజపరిచి యాక్టివ్‌నెస్, కాన్ఫిడెంట్ పెంచడంలో వృక్షాసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగూ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రాబోయే విద్యా సంవత్సరం చదువులోనూ చురుకుదనం ప్రదర్శిస్తారు. ఇక ఎలా వేయాలంటే.. రెండు కాళ్లపై నిటారుగా నిల్చోవాలి. ఒక కాలుని వంచి, దాని పాదాన్ని మరో కాలు తొడపై ఉంచాలి. కొద్దిసేపటి వరకూ అలాగే నిలబడాలి. కాలు మార్చి కాలితో రిపీట్ చేస్తూ ఓపిక ఉన్నంత సేపూ చేయాలి. దీంతో పిల్లల్లో, పెద్దల్లో కూడా తెలివితేటలు పెరుగుతాయి.