అలాంటి మహిళలను పెళ్లి చేసుకునేందుకు పురుషుల్లో అనాసక్తి.. తమ చెయ్యి దాటిపోతారనే..!
‘భర్త మాత్రమే బయటకు వెళ్లి సంపాదించాలి. భార్య ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకోవాలి.
దిశ, ఫీచర్స్: ‘భర్త మాత్రమే బయటకు వెళ్లి సంపాదించాలి. భార్య ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకోవాలి. స్త్రీలు ఉద్యోగం చేయకూడదు’’ అనే గతకాలపు ఆలోచనలు ప్రస్తుతం చాలా వరకు మారాయని, ఇంకా మారుతున్నాయని ఒక తాజా అధ్యయనం పేర్కొంది. భార్యలు భర్తలకంటే ఎక్కువగా సంపాదిస్తున్న పరిస్థితి యూఎస్‌లో పెరుగుతోందని, ఇది సమానత్వ వివాహ వ్యవస్థకు, విడాకుల రేటు తగ్గడానికి దోహదం చేస్తోందని సామాజిక వేత్తలు అంటున్నారు. అయితే ఇండియాలో మాత్రం ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉంది. భార్య ఇంటికే పరిమితం కావాలని, ఉత్తమ ఇల్లాలుగా ఉండాలని కోరుకునే వారే భారత దేశంలో అత్యధిక మంది ఉంటున్నారని పరిశోధకులు చెప్తున్నారు.
విస్కాన్సిన్-మాడిసన్(Wisconsin-Madison)యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన సోషల్ సైంటిస్టులు క్రిస్టీన్ స్క్వార్ట్‌జ్(Christine Schwartz) అండ్ పిలార్ గోనాలన్స్-పోన్స్ (Pilar Gonalons-Pons) ఆధునిక రిలేషన్ షిప్ పరిణామాలు, వివాహ వ్యవస్థలో మార్పుల గురించి తెలుసుకునే ఉద్దేశంతో యూఎస్ బేసిగ్గా ఒక అధ్యయనం నిర్వహించారు. ఇటీవల యూఎస్‌లో భార్యలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని వీరి పరిశీలనలో తేలింది.
అంతే కాదు గతానికి భిన్నంగా తమకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిని పెళ్లి చేసుకోవడానికి పురుషులు ఇష్టపడుతుండటం చాలా వరకు జర్నలైజ్ అయిపోయింది. దీనివల్ల దీనివల్ల యూఎస్‌లో గతంకంటే విడాకులు తగ్గే అవకాశం ఉందని అధ్యయన కర్తలు పేర్కొన్నారు. 1970లో భార్యలకంటే భర్తలు ఎక్కువ సంపాదిస్తున్న రోజులలో విడాకుల 70 శాతం ఉంటే, భార్యలు ఎక్కువగా లేదా భార్య భర్తలు సమానంగా సంపాదిస్తున్న జంటల్లో ప్రస్తుతం విడాకులు తీసుకునే అవకాశం గణనీయంగా 4 శాతానికి తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. పైగా ఇది సమానత్వ వివాహాలను జర్నలైజ్ చేసేందుకు దోహదం చేసిందని అధ్యయనం పేర్కొన్నది.
ఇండియాలో పరిస్థితి
అధ్యయనం యూఎస్ బేసిగ్గానే జరిగినప్పటికీ ఇండియాలో పరిస్థితిని కూడా కొంత మేరకు పరిశోధకులు ప్రస్తావించారు. వివాహ వ్యవస్థలో, సంపాదన విషయంలో జెండర్ రోల్ గురించిన మూస పద్ధతులను ఇక్కడ కొనసాగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల భార్యలు కూడా ఉద్యోగాలు చేయడానికి భర్తలు లేదా కుటుంబాలు అనుమతి ఇస్తున్నప్పటికీ తమకంటే ఎక్కువ సంపాదించే స్త్రీలను చేసుకోవడానికి ఇష్టపడే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. పైగా భార్య ఇంట్లోనే ఉండి, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోవడమే మంచిదని అభిప్రాయ పడే పురుషులు, కుటుంబాలే ఇండియాలో మెజార్టీగా ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
మన దేశంలో కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సాధారణ భారతీయ పురుషులు మెజార్టీగా తమ కంటే తక్కువ సంపాదిస్తున్న స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. అంటే నిరుద్యోగ మహిళలు పెళ్లి సంబంధాలను పొందే అవకాశం ఇండియాలో ఎక్కువ. కానీ ఎందుకు? భర్త కంటే భార్య ఎక్కువ సంపాదించడం ఎందుకు ఆమోదయోగ్యం కాదు? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి?
డిఫరెంట్ జండర్ రోల్స్
వివాహ వ్యవస్థలో, ఆ తర్వాత జీవన పరిస్థితుల్లో జెండర్ సమానత భావన మన దేశంలో చాలా తక్కువ. సాంప్రదాయకంగా మన పితృస్వామ్య సమాజం పురుషులు ప్రదాతలుగా ఉండాలని, స్త్రీలు కుటుంబ సంరక్షకులుగా ఉండాలని విశ్వసిస్తారు. ఇదిక్కడ సాధారణ టెంప్లేట్, ఈ విధమైన జండర్ రోల్ అనుసరించడం ఒక సోషల్ జర్నీగా ఉంటోంది. కేవలం పురుషులకే ప్రాధాన్యతను ఇచ్చే జండర్ రోల్స్‌ను తిప్పికొట్టి, స్త్రీలు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం ప్రారంభించినట్లయితే, తాము వారిపై నియంత్రణను, అధికారాన్ని కోల్పోతామని పురుష ప్రపంచం నమ్ముతోంది. ఎందుకిలా? భార్యపై భర్త ఎందుకు ఆధిపత్యం చెలాయించాలి? అనే ప్రశ్నలకు ఇక్కడ సమాధానం సరిగ్గా ఉండదు. భారతీయ సమాజంలో సమానత్వ వివాహం ఎందుకు పెద్ద ప్రశ్నగా మారిందనే విషయంపై విదేశాల్లో ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి.
ఆ ధోరణి మారాలి
యూఎస్ బేస్డ్ పరిశోధన ప్రకారం.. భార్యలు ఎక్కువగా సంపాదించినా, కపుల్స్ ఇద్దరూ సమానంగా సంపాదించినా అంగీకరించే సమానత్వ వివాహాలు(egalitarian marriages) ఇక్కడ విడాకుల పెరుగుదలను తగ్గిస్తున్నాయి. కానీ భారతదేశం వంటి పితృస్వామ్య దేశంలో సమానత్వ వివాహాలు ఆమోదయోగ్యంగా ఉండవు. ఎందుకంటే ఇక్కడి సమాజంలో సాంప్రదాయిక అసమాన మనస్తత్వ ధోరణులు ఇంకా మారలేదు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలను స్త్రీ వాదులు, సామాజిక వేత్తలు కోరుతున్నారు. భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే, దాని గురించి సిగ్గుపడటానికి లేదా తక్కువ అనుభూతి చెందడానికి ఏమీ లేదనే వాస్తవాన్ని పురుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కువ సంపాదిస్తున్నప్పుడో, భార్యలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నప్పుడో మహిళలకు ఇవి తగదు? అనే భావన తొలగిపోవాలి. పైగా బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడం, ఎక్కువ సంపాదించడం భార్యలు లేదా స్త్రీల తెలివికి, స్వతంత్రతకు, సక్సెస్ ఫుల్ కెరీర్ జర్నీకి నిదర్శనంగా ఎందుకు భావించ కూడదో ఆలోచించాలంటున్నారు నిపుణులు. అప్పుడు లింగ అసమానతలు, వివక్ష పోయి సమానత్వ వివాహ వ్యవస్థ ఇండియాలోనూ ఏర్పడే అవకాశం ఉంటుందని మహిళా నిపుణులు చెప్తున్నారు.
Also Read...
థైరాయిడ్ Vs సంతానోత్పత్తి.. పునరుత్పత్తి హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం