మహిళలకు అలర్ట్.. ఫిట్‌గా ఉండాలని ఓవర్ వర్కవుట్స్ ట్రై చేస్తున్నారా..? తర్వాత జరిగేది ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా ఒబేసిటీ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలువు యువతీ యువకులు, పెద్దలు అలర్ట్ అవుతున్నారు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఒబేసిటీ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలువు యువతీ యువకులు, పెద్దలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం ఇటీవల వ్యాయామాలు, వర్కవుట్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకోసం వారు ఆహార నియమాలు పాటించడం, జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేయడం కూడా చేస్తున్నారు. అయితే కొందరు ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ పరిమితికి మించి వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఓవర్ ఎక్సర్‌సైజ్ చివరికి వివిధ మహిళల్లో అనారోగ్యాలకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోకుండా కేర్ తీసుకోవాలని మహిళలు భావిస్తుంటారు. అందుకోసం శారీరక వ్యాయామానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఇది మంచిదే కానీ.. కొందరైతే మరీ ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా మారుతున్నారని, విపరీతమైన వ్యాయామాలతో తర్వాత ఇబ్బందుల్లో పడుతున్నారని నిపుణులు అంటున్నారు. అమ్మాయిల్లో ఈ అధిక వ్యాయామం వారి మెన్‌స్ట్రువల్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
* అధిక వ్యాయామాలు శరీరంపై ఒత్తిడి పెంచి అధిక అలసటకు దారితీయడంవల్ల రుతుక్రమం సరిగ్గా రాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే చాన్సెస్ ఉన్నాయట. క్రమంగా ఇది ‘అమెనోరియా’ వ్యాధికి దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంటే శరీరానికి తగినంత విశ్రాంతి లేదా ఆహారం లేకపోతే తలెత్తే సమస్యే ఇది. అధిక వ్యాయామాలవల్ల కొందరిలో ఇదే జరుగుతోంది.
* అంతేకాకుండా జిమ్‌లో అతిగా వర్కవుట్లు చేయడం మహిళల శరీరంపై అధిక ఒత్తిడిని పెంచడం ద్వారా ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించడం, హర్మోన్ల ప్రొడ్యూసింగ్‌లో హెచ్చు తగ్గులు రావడం జరుగుతాయి. ఇది రుతుక్రమ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో నెల నెలా రావాల్సిన పీరియడ్స్ రెండు మూడు నెలలకు ఒకసారి రావచ్చు.
* అధిక కసరత్తులవల్ల శరీరంపై ఒత్తిడి పెరగడం, ప్రతికూల ప్రభావం కారణంగా మహిళల్లో రుతుక్రమం సరిగ్గా రాకపోవడం క్రమంగా ఇతర సమస్యలకు కూడా దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ హర్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో ఎముకల బలహీనత, శారీరక బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శరీరానికి వ్యాయామాలు చాలా ముఖ్యమే. కానీ అధిక వ్యాయామాలు అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. కాబట్టి అవసరం మేరకే వర్కవుట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.