నిద్రకు.. మరణానికి లింకేంటి.. నిపుణులేం చెప్తున్నారు?

డైలీ కనీసం ఐదు గంటలకంటే తక్కువ నిద్రపోవడం వివిధ అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Update: 2023-08-27 07:03 GMT

దిశ, ఫీచర్స్: డైలీ కనీసం ఐదు గంటలకంటే తక్కువ నిద్రపోవడం వివిధ అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినవారిలో ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే త్వరగా మరణం సంభవించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కొంతమందికి అనారోగ్యం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలాగే నిద్ర తగినంతగా లేకపోవడంవల్ల కూడా మరికొందరిలో అనారోగ్యానికి దారితీస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ విషయాన్ని కనుగొనడానికి బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 8 వేలమందిపై స్టడీ నిర్వహించారు. వారంలో యావరేజ్‌గా నైట్‌టైమ్‌లో ఎన్నిగంటలు నిద్రపోతారని రెస్పాండెంట్స్‌ను ప్రశ్నించారు. దీంతోపాటు గత 20 ఏళ్లలో డయాబెటిస్, కేన్సర్, హృద్రోగాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో నిద్ర, అనారోగ్యాలు, మరణాలకు గల కారణాలను కూడా ట్రాక్ చేశారు.

బ్రిటన్ శాస్త్రవేత్తలు స్టడీలో భాగంగా 48 నుంచి 50 ఏళ్ల వయస్సు గలవారిలో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిని ఒక గ్రూపుగా విభజించారు. అదే వయస్సు గలవారిలో 7 గంటలు నిద్రపోయేవారిని మరొక గ్రూపుగా విభజించారు. ఈ రెండు గ్రూపులను కొంతకాలం ట్రాక్ చేయగా రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు 30 శాతం అదనంగా ఆరోగ్య ముప్పును కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.

దీనివల్ల వీరిలో త్వరగా మరణం సంభవించే అవకాశాలు మెండుగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇక వీరితో పోల్చితే 7 గంటలు నిద్రపోయేవారిలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటున్నట్లు సైంటిస్టులు గమనించారు. పైగా 5 గంటలకంటే నిద్రపోయేవారితో పోల్చినప్పుడు అనేక విషయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారని, జీవన ప్రమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. సాధారణంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల మనసుకు, శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తోందని, ఇది వికాసానికి, పునరుత్తేజానికి దోహద పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే 5 గంటలకంటే తక్కువ నిద్రపోయే అవకాశం ఉన్నవారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

Also Read:   చదివింది గుర్తుండట్లేదా?.. మెమరీ పవర్ పెరగాలంటే ఇలా చేయండి?


Similar News