మనిషికి స్వరం ఓ వరం: ఈ రోజు వరల్డ్ వాయిస్ డే

మాట్లాడటం అనేది మనిషికి లభించిన ఓ వరం. మనిషి తన గొంతుతో మాటలు పలికిస్తూ ఇతరులతో కమ్యూనికేట్ చేస్తుంటాడు.

Update: 2023-04-15 18:45 GMT

దిశ, వెబ్ డెస్క్: మాట్లాడటం అనేది మనిషికి లభించిన ఓ వరం. మనిషి తన గొంతుతో మాటలు పలికిస్తూ ఇతరులతో కమ్యూనికేట్ చేస్తుంటాడు. అలాగే తన సుస్వర స్వరంతో పాటలు పాడుతూ తోటివాళ్లను మైమరిపిస్తుంటాడు. స్వరానికి ఇంత ప్రాముఖ్యం ఉంది కాబట్టే వార్షిక క్యాలెండర్ లో ‘వాయిస్’ కంటూ ఓ రోజు ఉంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఏప్రిల్ 16న ‘ప్రపంచ వాయిస్ దినోత్సవం (వరల్డ్ వాయిస్ డే)’ను నిర్వహిస్తారు.


వరల్డ్ వాయిస్ డే (WVD) చరిత్ర

వాయిస్ డే జరుపుకోవాలనే ఆలోచనను మొదట బ్రెజిలియన్ వాయిస్ కేర్ నిపుణులు చేశారు. ఈ క్రమంలోనే మొదట వాళ్లు బ్రెజిలియన్ వాయిస్ డేను నిర్వహించి క్రమేణ వరల్డ్ వాయిస్ డేను నిర్వహించడానికి యూరప్ లోని మిగతావాళ్లను సంప్రదించి ఒప్పించారు. ఈ క్రమంలోనే 1999 నుంచి ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2002 నుంచి అమెరికా ఈ దినోత్సవంలో భాగస్వామ్యమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఓ ప్రత్యేక థీమ్ తో ఈ డేను నిర్వహిస్తూ వస్తున్నారు.


వరల్డ్ వాయిస్ డే ప్రాముఖ్యత

రోజువారి జీవితంలో తోటివాళ్లతో కమ్యూనికేట్ చేయడానికి వాయిస్ అనేది చాలా ముఖ్య సాధనం. అయితే కొంతమంది ఈ విషయాన్ని మరిచి ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లతో తమ స్వరాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాగే గట్టిగా అరవడం వల్ల కూడా వాయిస్ ను పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాయిస్ యొక్క గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేందుకు ఈ డేను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని వైద్యులు, వాయిస్ పరిశోధకులు వాయిస్ ఇంప్రూవ్ మెంట్ గురించి వాయిస్ ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అవగాహన కల్సిస్తుంటారు.


ఈ ఏడాది వాయిస్ డే ‘థీమ్’ ఇదే..!

1999 నుంచి వాయిస్ డేను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఓ థీమ్ తో ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఓ సరికొత్త థీమ్ తో వరల్డ్ వాయిస్ డే ను జరుపుతున్నారు. ఇక ఈ థీమ్ ను అమెరికన్ అకాడమీ ఆఫ్ వొటలారింగోలాజీకి చెందిన వాయిస్ కమిటీ ఎంపిక చేసింది. ఇక ‘‘యువర్ వాయిస్ మ్యాటర్స్’’ అనేది ఈ ఏడాది థీమ్.

Tags:    

Similar News