TRENDING: ఈ ఐకానిక్ సాంగ్‌కు దుమ్మురేపే స్టెప్స్‌ వేసిన ఎలన్ మస్క్, ట్రంప్ .. ఇప్పటికే 80 మినిలియన్ల మంది చూసేశారుగా.. (Viral Video)

ఎలన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకానిక్ బీ గ్రీస్ ట్రాక్ ' స్టెయిన్ అలైవ్ ' కు ఇద్దరు స్టెప్స్ అదరగొట్టేశారు. ముందుగా US సెనేటర్ మైక్ లీ ఈ AI వీడియోను Xలో పోస్ట్

Update: 2024-08-15 17:22 GMT

దిశ, ఫీచర్స్ : ఎలన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకానిక్ బీ గ్రీస్ ట్రాక్ ' స్టెయిన్ అలైవ్ ' కు ఇద్దరు స్టెప్స్ అదరగొట్టేశారు. ముందుగా US సెనేటర్ మైక్ లీ ఈ AI వీడియోను Xలో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత మస్క్ షేర్ చేశాడు. హేటర్స్ మాత్రమే AI అని చెప్తారనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో ఇప్పటికే 80 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఎలన్ మస్క్ X లైవ్ లో రిపబ్లిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ను ఇంటర్వ్యూ చేశాక ఈ వీడియో పోస్ట్ చేయడం విశేషం. కాగా ఆగస్ట్ 13న జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ మనోవేదనలు, వ్యక్తిగత దాడులు, బోల్డ్ క్లెయిమ్‌ల గురించి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతిచ్చిన మస్క్.. ప్రోత్సాహాన్ని అందించాడు. ఇక ట్రంప్ పై ఎటాక్ తర్వాత జూలైలో ఎండోర్స్ మెంట్ ప్రకటించాడు మస్క్.

Tags:    

Similar News