పెళ్లిలో షాకింగ్ సంఘటన.. ఏనుగొచ్చి జయమాల వేసింది! (వీడియో)
పెళ్లనగానే వధూవరులు ఎన్నో కలలుకంటారు. Elephant Gives Aashirvaad with Jaimala to Bride and Groom.
దిశ, వెబ్డెస్క్ః పెళ్లనగానే వధూవరులు ఎన్నో కలలుకంటారు. వివాహం ఇలా జరగాలి, అలా జరగాలి అని చాలా ప్లాన్లు వేసుకుంటారు. పెళ్లి కూతురికి వరమాల వేసేటప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ ఉండే సమయం అందరికీ ఎంతో ఆసక్తిని, సంతోషాన్ని ఇస్తుంది. అయితే, భారతదేశంలో అవిజ్ఞుడిగా హిందువు కొలిచే గణేషుడు స్వయంగా వచ్చి, వధూవరుల్ని వరమాల వేసి, ఆశీర్వదిస్తే.. ఎలా ఉంటుందో ఈ పెళ్లి చూస్తే తెలుస్తుంది. తమ పెళ్లి వేడుకలో ఓ జంటకు ఆశీస్సులు ఇస్తున్న ఏనుగును చూసి నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజీలో షేర్ చేశారు. ఈ అరుదైన సన్నివేశం మీరూ చూడండి..