ఆ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. ఆసుపత్రి పాలవ్వాల్సిందే..

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు.

Update: 2024-10-05 10:36 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కండరాలకు చాలా ఉపశమనం కలుగుతుందంటున్నారు నిపుణులు.

ఇవన్నీ కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలే.. కానీ దీన్ని తాగడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా కొన్ని తీవ్రమైన నష్టాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలిసి ఉండదు. ఔను ఇది నిజమే, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కొంతమందిలో కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. మాయో క్లినిక్ ప్రకారం కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీళ్ళు తాగకుండా ఉండడమే మేలంటున్నారు నిపుణులు. లేదంటే వారి సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ స్థాయి పెరుగుతుంది..

కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ నీళ్లను అధికంగా తాగడం వల్ల కేలరీలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. వీటిని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నట్లయితే వారు రోజుకు ఒకటి కంటే ఎక్కువ గ్లాసు కొబ్బరి నీటిని తీసుకోవడం మానుకోవాలని చెబుతున్నారు.

చర్మ అలెర్జీలు..

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా కొందరిలో అలర్జీ సమస్యలు వస్తాయి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారిలో దురద, మంట, ఎర్రగా మారడం మొదలైన సంకేతాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

తక్కువ రక్తపోటు..

తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కొబ్బరి నీటిని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉండడంతో ఇది రక్తపోటు స్థాయిని మరింత తగ్గిస్తుంది. ఇక అధిక రక్తపోటు ప్రమాదం ఉన్నవారు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి ఎటువంటి మందులు లేకుండా బీపీని నార్మల్‌గా ఉంచుకోవాలనుకుంటే కొబ్బరి నీళ్లు మంచి ఎంపిక.

జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం..

కొబ్బరి నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అదనపు పొటాషియం విరేచనాలకు కారణమవుతుంది. కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నప్పటికీ ఎక్కువగా కొబ్బరి నీటిని తీసుకోవడం మానుకోవాలని చెబుతున్నారు. ఒక్కోసారి కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో అదనపు నీళ్లు పేరుకుపోతాయంటున్నారు. దీని వల్ల కడుపు ఉబ్బరం, అపానవాయువు ఏర్పడుతుందట.

మళ్లీ మళ్లీ టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది..

కొబ్బరి నీళ్లలో మూత్రవిసర్జన గుణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అధికంగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. శరీరానికి తగిన పరిమాణంలో కొబ్బరి నీటిని తీసుకుంటే అది అనేక ప్రయోజనాలను అందిస్తుందంటున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News