ఇంట్లో చెప్పులు లేకుండా నడవొద్దు.. ఈ ప్రమాదం పొంచి ఉంది...
సాధారణంగా ఇంట్లో అందరూ చెప్పులు లేకుండానే నడుస్తారు. పరిశుభ్రంగా ఉండేందుకు ఇదే మార్గం అనుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో ఇదే పద్ధతి
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇంట్లో అందరూ చెప్పులు లేకుండానే నడుస్తారు. పరిశుభ్రంగా ఉండేందుకు ఇదే మార్గం అనుకుంటారు. ముఖ్యంగా మన దేశంలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్ వేరుగా ఉండొచ్చు కానీ పేద, మధ్యతరగతి ఇళ్లలో మాత్రం చెప్పులు ఇంటి ముందే విప్పి లోపలికి అడుగు పెట్టాలి. కానీ ఇంట్లో ఇలా చేయడం వల్ల ప్రమాదమని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం.
మన ఇంట్లో కూడా పాదాలకు రక్షణ అవసరం అంటుంది తాజా అధ్యయనం. చెప్పులు లేకుండా నడిస్తే పాదాలు, కాలి వేళ్లకు గాయాలు కావచ్చు. పదునైన వస్తువులపై అడుగు పెట్టడం లేదా తడి ఉపరితలాలపై కాలు పడితే జారిపోయే అవకాశం ఉంది. ఈ చిన్న కోతలు, గాయాలు లేదా పగుళ్లు మరింత తీవ్రమైన గాయాలకు దారి తీయవచ్చు. జర్నల్ ఆఫ్ ఫుట్ అండ్ యాంకిల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే గాయాల పెరుగుదలను హైలైట్ చేసింది. ముఖ్యంగా వృద్ధులలో ఈ ప్రమాదం ఎక్కువ అని చెప్పింది.