కాలు మీద కాలేసుకుని కూర్చుంటే.. మగాళ్లలో పడిపోతున్న స్పెర్మ్ కౌంట్..
మీరు హాయిగా కూర్చున్నారా? ఒక్క క్షణం ఆగి కూర్చున్న భంగిమను గమనించండి.
దిశ, ఫీచర్స్: మీరు హాయిగా కూర్చున్నారా? ఒక్క క్షణం ఆగి కూర్చున్న భంగిమను గమనించండి. మీ కాళ్లు ఏం చేస్తున్నాయి? క్రాస్‌గా ఉన్నాయా? మీరు లెఫ్ట్ క్రాసరా లేదంటే రైట్ క్రాసరా? దాదాపు 62 శాతం మంది వ్యక్తులు ఎడమకాలిని మడిచి కుడికాలిపై వేసి కూర్చుంటారు. 26 శాతం మంది దీనికి అపోజిట్‌గా కూర్చుంటే.. 12 శాతం మంది నచ్చినట్లుగా కూర్చుంటారు. అంతేకాదు కుర్చీలో కూర్చుని కాళ్లను క్రాస్ చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మోకాలి వద్ద, మరొకటి చీలమండలం(యాంకిల్) వద్ద. అయితే కాళ్లను ఒకదానిపై ఒకటి వేసుకుని కూర్చోవడం ఎంత హాయిగా ఉన్నా.. ఈ పద్ధతి ఆరోగ్యానికి మంచిదికాదని చెప్తున్నారు నిపుణులు.
బాడీపై ఎఫెక్ట్
* కాళ్లను క్రాస్ చేయడం వల్ల ఒకదానికంటే మరొకటి ఎత్తుగా ఉండటంతో తుంటి మిస్‌అలైన్‌మెంట్‌ను పెంచుతుంది.
* కింది భాగంలోని అవయవాలలోని రక్త నాళాల ద్వారా రక్తం కదిలే వేగం మారుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.
* మోకాళ్ల వద్ద లెగ్స్ క్రాస్ చేయడమనేది చీలమండల కంటే అధ్వాన్నంగా ఉంటుంది. ఈ విధంగా కూర్చోవడం వల్ల సిరల్లో రక్తం చేరడం, గుండె దీనికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్త నాళాలకు హాని కలుగుతుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు.. పాదాలను నేలపై ఉంచాలి.
* ఎక్కువ సేపు లేదా ఎక్కువసార్లు లెగ్స్ క్రాస్ చేసి కూర్చుంటే.. కటిలో కండరాల పొడవు, ఎముకల అమరికలలో దీర్ఘకాలిక మార్పులను కలిగి ఉంటారు. అస్థిపంజరం ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన విధానం కారణంగా లెగ్ క్రాసింగ్ వెన్నెముక, భుజాల తప్పుడు అమరికకు కారణం కావచ్చు.
* మీ గురుత్వాకర్షణ కేంద్రాన్ని పెల్విస్ పైన ఉంచడానికి వెన్నెముక హెల్ప్ చేస్తుంది. కాబట్టి మెడ ఎముకలలో మార్పుల కారణంగా హెడ్ పొజిషన్ అలైన్మెంట్ కూడా దెబ్బతింటుంది.
* శరీరంలో ఒక వైపు మరోవైపు కంటే బలహీనంగా ఉండే పొజిషన్‌తో మెడ ప్రభావితమవుతుంది. పేలవమైన భంగిమ, కాళ్లపై కూర్చోవడం వల్ల కలిగే ఒత్తిళ్ల ఫలితంగా పెల్విస్, దిగువ వీపు కండరాలలో అదే అసమతుల్యత కనిపిస్తుంది.
* గ్లూటల్ (బం) కండరాలను ఒక వైపు ఎక్కువసేపు సాగదీయడం వల్ల కటి కూడా తప్పుగా అమర్చబడి ఉండవచ్చు. అంటే అవి బలహీనంగా మారతాయి.
* క్రాస్ లెగ్‌తో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పార్శ్వ గూని(వెన్నెముక అసాధారణంగా అమర్చడం), ఇతర వైకల్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది గ్రేటర్ ట్రోచాంటెరిక్ పెయిన్ సిండ్రోమ్‌ను కూడా కలిగిస్తుంది. ఇది తుంటి, తొడ బయటి భాగాన్ని ప్రభావితం చేసే బాధాకరమైన పరిస్థితి.
* స్పెర్మ్ ఉత్పత్తి ప్రభావితం అవుతుందనే ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వృషణాల ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే 2 °C నుంచి 6 °C (3.6 °F మరియు 10.8 °F) మధ్య ఉండాలి. కానీ కూర్చోవడం వల్ల 2 °C పెరిగితే.. లెగ్స్ క్రాస్ చేయడం వల్ల 3.5 °C వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇలా వృషణాల ఉష్ణోగ్రత పెరుగుదల స్పెర్మ్ కౌంట్, నాణ్యత రెండింటినీ తగ్గిస్తుందని సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: సంతానలేమి సమస్యలు.. అండోత్పత్తిని ప్రేరేపించేందుకు ఐవీఎఫ్