విటమిన్ D ఎఫెక్ట్.. గర్భం దాల్చే అవకాశం ఉండదా..?

ఆరోగ్యకరమైన శరీరం అనేది సరైన అలవాట్లు, జీవనశైలి, రోజువారీ జీవితంలో అవసరమైన పోషకాల తగినంత మొత్తం.

Update: 2023-06-08 11:49 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యకరమైన శరీరం అనేది సరైన అలవాట్లు, జీవనశైలి, రోజువారీ జీవితంలో అవసరమైన పోషకాల తగినంత మొత్తం. ఇందులో విటమిన్ డి అనేది ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిన అంశం. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు మహిళల్లో సర్వసాధారణం అవుతున్నాయి. విటమిన్ D లోపం ఇందుకు గల కారణాల్లో ఒకటి. కాగా ఈ సన్‌షైన్ విటమిన్ ఎముక ఆరోగ్యాన్ని కాపాడటంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

సంతానోత్పత్తిని ఎలా మెరుగుపరుస్తుంది?

రక్తంలో 30 ng/mL విటమిన్ డి అధిక గర్భధారణ రేటుతో ముడిపడి ఉందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్న వారితో పోలిస్తే సరైన మోతాదులో ఉన్న వ్యక్తులు గర్భం దాల్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు విటమిన్ డి తక్కువ మోతాదు సంతానోత్పత్తి చికిత్సల విజయవంతమైన రేటును ప్రభావితం చేస్తుంది.

ఫెర్టిలిటీ అండ్ విటమిన్ డి లింక్

1. పునరుత్పత్తి పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం

విటమిన్ D గ్రాహకాలు సాధారణంగా మావి, గర్భాశయం, అండాశయాలతో సహా వివిధ పునరుత్పత్తి కణజాలాలలో కనిపిస్తాయి. విటమిన్ డి పునరుత్పత్తి పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాలను చూపుతుందని ఇది సూచిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్న సాధారణ పరిస్థితులైన వంధ్యత్వం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో విటమిన్ డి లోపం ప్రబలంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. శరీరంలోని హార్మోన్ల నియంత్రణ

పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH), యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) వంటి అనేక హార్మోన్ల నియంత్రణలో విటమిన్ డి పాల్గొంటుంది. ఈ హార్మోన్లు ఒవేరియన్ ఫోలిక్యులర్ డెవలప్‌మెంట్, అండోత్సర్గము, మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి తగినంత స్థాయిలు ఈ హార్మోన్ల సరైన సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడవచ్చు. తద్వారా సంతానోత్పత్తిని ప్రోత్సహించవచ్చు.

3. అండాశయ పనితీరు మెరుగు

విటమిన్ డి సప్లిమెంటేషన్ పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అండాశయ పనితీరును మెరుగుపరుస్తుందని చూపబడింది. దీని ఫలితంగా మెరుగైన ఋతుక్రమం, అండోత్సర్గము రేటు పెరుగుతుంది.

4. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ మాడ్యులేషన్

విటమిన్ డి.. ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్, విజయవంతమైన గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తుంది. జన్యు వ్యక్తీకరణ, సెల్యులార్ విస్తరణ, రోగనిరోధక వ్యవస్థ నియంత్రణను ప్రభావితం చేయడం ద్వారా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని మాడ్యులేట్ చేస్తుందని కనుగొనబడింది. తగినంత విటమిన్ డి స్థాయిలు ఎంబ్రియో ఇంప్లాంటేషన్‌లో సహాయపడే మరింత ప్రయోజనకరమైన ఎండోమెట్రియల్ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.

5. పునరుత్పత్తి ఆరోగ్య నియంత్రణ

పునరుత్పత్తి ఆరోగ్యానికి సరైన విటమిన్ డి స్థాయిలను నిర్వహించడం చాలా అవసరం. కానీ పరిమిత సూర్యరశ్మి ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా సన్‌రేస్‌కు ఎక్స్‌పోజ్ కావడం, ఫ్యాటీ ఫిష్ ఆహారాన్ని తీసుకోవడం, బలవర్ధకమైన పాల ఉత్పత్తులు, సప్లిమెంటేషన్ ద్వారా తగినంత విటమిన్ డి స్థాయిలను మెయింటెన్ చేయవచ్చు.

విటమిన్ డి స్థాయిలను ఎలా పెంచుకోవచ్చు?

శరీరంలో తక్కువ విటమిన్ డి స్థాయిలను భర్తీ చేయడానికి ఉత్తమ మార్గం ప్రత్యక్ష సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కావడం. మనలో చాలా మంది సూర్యరశ్మికి తక్కువగా బహిర్గతం అవుతుంటారు. దీని ఫలితంగా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అదనంగా పుట్టగొడుగులు, చేపలు వంటి ఆహారాలు విటమిన్ డిలో సమృద్ధిగా పరిగణించబడతాయి. ఇంకా వైద్యుడు సూచించిన విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా లోపాన్ని సరిదిద్దవచ్చు.

విటమిన్ డి స్థాయిలను ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు

* ఒక వ్యక్తి అధిక బరువుతో నల్లటి చర్మం కలిగి ఉంటే.. ఆ వ్యక్తికి విటమిన్ డి తక్కువగా ఉండే ప్రమాదం అధికంగా ఉంటుంది.

* విటమిన్ డి సరైన టైమ్‌లో ఆరోగ్యకరమైన గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి లోపం వల్ల అకాల పుట్టుక, గర్భధారణ మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* విటమిన్ డి సప్లిమెంట్‌లు తల్లులలో గర్భధారణ-సంబంధిత రివర్సిబుల్ బోన్ లాస్ నష్టాన్ని అరికట్టడంలో సహాయపడుతాయి. నేరుగా సూర్యరశ్మికి బహిర్గతం కావడం, సన్‌షైన్ విటమిన్ డిలో కొన్ని గంటలపాటు ఉండటం.. శరీరం మరింత సమర్థవంతంగా UVB కిరణాలను స్వీకరిస్తుంది.

ఇవి కూడా చదవండి:

హై జెనెటిక్ రిస్క్‌ బాధితుల్లోనూ డయాబెటిస్‌‌ ప్రభావాన్ని తగ్గిస్తున్న వ్యాయామం  

Tags:    

Similar News