జ్వరమొస్తే నోరు రుచిగా ఉండట్లేదా? అనేక పోషకాలు నిండి ఉన్న ఈ వెజ్ సూప్ తాగండి

సాధారణంగా ఎవరికైనా ఫీవర్ వస్తే నోరు రుచి చెడిపోతుంది.

Update: 2024-09-27 15:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరికైనా ఫీవర్ వస్తే నోరు రుచి చెడిపోతుంది. ఎంత టేస్టీగా ఉన్న ఆహార పదార్థాలు కూడా తినాలనిపించదు. అనారోగ్యం వల్ల నోటికి ఏం తిన్నా రుచి ఉండదు. కాగా జ్వరం వచ్చినప్పుడు ఈ వెజిటేబుల్ సూప్ ఓ సారి ట్రై చేయండి. రుచితో పాటు అనేక పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఈ సూప్ ను మీ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కూరగాయ ముక్కల్లోని పీచు ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ను ఇస్తుంది. కాగా వెబ్ సూప్ సింపుల్ తయారీ విధానం తెలుసుకుందాం..

వెజిటబుల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

సరిపడ ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం ముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు, 2 క్యారెట్లు పావు కప్పు బీన్స్, 1 క్యాప్సికం, రెండు చెంచాల బఠానీలు, సరిపడ సాల్ట్, మిరియాల పొడి, స్వీట్ కార్న్ ఫ్టోర్, 2 చెంచాల క్యాబేజీ ముక్కలు, రెండు చెంచాల ఉల్లికాడల తరుగు, అరచెంచా మిక్స్డ్ హెర్బ్స్.

తయారీ విధానం చూసినట్లైతే..

వెజిటేబుల్స్ అన్ని క్లీన్ గా శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాక.. క్యాప్సికం, బఠానీలు, క్యాబేజీ, స్వీట్ కార్న్ కార్న్ వేసి కాస్త వాటర్ సాల్ట్ వేసి కలపాలి. ఒక పది నిమిషాలయ్యాక కూరగాయలన్నీ ఉడుకుతాయి. సూప్ లో కూరగాయలు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అనంతరం ఒక బౌల్ లో స్వీట్ కార్న్ ఫ్లోర్ ను పావు కప్పు వేసి కలపండి. కూరగాయలు ఉడికాక అందులో ఈ స్వీట్ ఫ్లోర్ తో రెడీ చేసింది వేయాలి. తర్వాత మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్, నిమ్మరసం వేయాలి. లాస్ట్ లో ఉల్లికాడల తరుగు వేసి కలిపితే రుచి అదిరిపోతుంది. ఫీవర్ వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ సూప్ ట్రై చేయండి. నోటికి రుచి ఉండటంతో పాటు అనేక పోషకాలు అందుతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News