మేకప్ లేకున్నా అందంగా మెరిసిపోవాలా.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి !

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యూటీ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. అందగా కనబడాలని ఆరాట పడుతున్నారు. అందం అంటే ఇక్కడ నలుపు, తెలుపు రంగులు కాదు, ఉన్నంతలో నీట్‌నెస్ మెయింటెన్ చేయడమేనని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-05-31 13:33 GMT

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యూటీ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. అందగా కనబడాలని ఆరాట పడుతున్నారు. అందం అంటే ఇక్కడ నలుపు, తెలుపు రంగులు కాదు, ఉన్నంతలో నీట్‌నెస్ మెయింటెన్ చేయడమేనని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇటీవల చాలా మంది మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా చర్మంపై గ్లో కనిపించాలని మేకప్ వేసుకోవడం కామన్ అయిపోయింది. ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లు ఇలా.. ఏ కార్యక్రమానికి హాజరైనా దానిని అనుసరిస్తుంటారు. అయితే మేకప్ వేసుకోకుండా కూడా అందంగా కనిపించాలంటే రోజువారీ జీవితంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

మీరు మేకప్ లేకుండా కూడా అందంగా మెరిసి పోవాలంటే.. హెల్తీ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడంవల్ల కూడా మేలు జరుగుతుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు బాదం పప్పులు, రైజిన్స్ లేదా ఇతర నాట్స్ రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట తింటూ ఉండాలి. దీంతో ముఖం, అలాగే శరీరంలోని ఇతర భాగాల్లో నల్లటి మచ్చలు, ముడతలు రాకుండా ఉంటాయి. యవ్వనంగా కనిపిస్తారు.

* క్వాలిటీ స్లీప్ కూడా ముఖ వర్ఛస్సును పెంపొందిస్తుంది. అందానికి, ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర పోయేలా చూసుకోండి. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరంలో సమతుల్య హార్మోన్లకు దోహదం చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, అందం వాటంతట అవే వస్తాయి.

* ఒత్తిడి, టెన్షన్స్ వంటివి కూడా ఏజింగ్ లక్షణాలకు కారణం అవుతాయి. ఎందుకంటే అధిక ఒత్తిడివల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ముఖం, స్కిన్ కళ తప్పుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. కాబట్టి వీలైనంత మేరకు అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి.

స్కిన్ కేర్ రొటీన్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. అయితే ఇతరులను చూసి, అలాగే చేయాలి, అలాగే ఉండాలి అనిమాత్రం అనుకోకండి. ఒక్కొక్కరి చర్మం ఒక్కో రకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీ స్కిన్ టోన్‌ని బట్టి మాయిశ్చరైజర్స్, టోనర్స్, ఫేస్ వాషెస్ వంటివి ఎంచుకోవాలి. అప్పుడే మీ చర్మంలో నిగారింపు వస్తుంది. ఇవన్నీ పాటిస్తే ప్రతిసారీ మేకప్ వేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. 


Similar News