చనిపోయిన వారి తల దగ్గర దీపం ఎందుకు పెడతారో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది.

Update: 2023-07-24 13:22 GMT

దిశ, ఫీచర్స్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఎక్కడైతే దీపారాధన చేస్తారో అక్కడ దేవుడు కచ్చితంగా ఉంటాడని నమ్ముతారు. అందుకే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరమని.. సూర్యాస్తమయం తర్వాత వెలిగించిన దీపంతో మహాలక్ష్మి కటాక్షిస్తుందని విశ్వసిస్తారు. ఇక తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని.. పడమటి రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ.. ఉత్తరం దిశగా సిరిసంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. కానీ చనిపోయాక శవం తల వద్ద దీపం ఎందుకు ఉంచుతారు అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తుంది. అది అశుభ కార్యం కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మరి శాస్త్రం ప్రకారం దీనికి గల కారణమేంటో చూద్దాం.

* శవాన్ని చీకటిలో ఉంచకూడదనే మరణించిన వ్యక్తి తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు. మనం బతికి ఉన్నప్పుడు వెలిగించిన దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో, అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా అదే దీపం మోక్ష మార్గం చూపుతుంది.

* అలాగే మరణించిన తర్వాత శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ మోక్ష మార్గాన వెళ్లడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటే.. ఉత్తర మార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తర మార్గం వైపునకు వెళ్ళడానికి దారి చూపిస్తుంది. అందుకే హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం తరతరాలుగా పాటించబడుతుంది.

Tags:    

Similar News