బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల విశిష్టత ఇవే..

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలుగు పండుగల్లోనే అతి పెద్దది.

Update: 2023-10-10 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలుగు పండుగల్లోనే అతి పెద్దది. ఇది అత్యంత అందమైన మరియు రంగురంగుల పండుగలలో ఇది ఒకటి. ఈ పండుగను 9 రోజులు ఊరంతా ఒకే చోట ఆనందంగా జరుపుకుంటారు. అన్ని రకాల పూల అలంకరణలతో బతుకమ్మ రెడీ చేసి సాయంత్రం ఒకే చోట చేరి పాటలు పాటుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ పండుగ భూమి, నీరు ప్రకృతిలో ఇతర వాటి మధ్య సంబంధాన్ని తెలుపుతూ జరుపుకునే పండుగ. కరువు నుంచి కాపాడాలని ప్రజలు గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా చేయడం వల్ల అందరూ 9 రోజులు ఒకేచోట కలుసుకుని తమ కష్టసుఖాలు పంచుకోవడంతో పాటుగా కొన్ని ప్రసాదాలను తయారుచేసుకుని తింటుంటారు. అలా చేయడం వల్ల బంధాలు బలపడుతాయి.

అందరిలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. పూల మధ్య స్వచ్ఛమైన గాలిని పీల్చుతారు కాబట్టి పలు రోగాలు రాకుండా ఉంటుంది. అలాగే బతుకమ్మ మధ్యలో పెట్టే పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుగ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందే కానీ హాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇది ప్రతి సంవత్సరం శుద్ధ పాడ్యమి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తికగా ఎదురుచూసే ఈ పండుగ రానే వచ్చింది. ఈ సంవత్సరం అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.. ఈ తొమ్మిది రోజులు ఏ రోజు ఏ బతుకమ్మను పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం..

అక్టోబర్ 14 శనివారం : ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య రోజు జరుగుతుంది.

అక్టోబర్ 15 ఆదివారం : అటుకుల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు.

అక్టోబర్ 16 సోమవారం: ముద్దపప్పు బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు ముద్దపప్పు బతుకమ్మ

అక్టోబర్ 17 మంగళవారం: నానే బియ్యం బతుకమ్మ ఆశ్వయుజ మూడోరోజైన తదియ రోజు నానే బియ్యం బతుకమ్మ

అక్టోబర్ 18 బుధవారం : అట్ల బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజు చవితి రోజు- అట్ల బతుకమ్మ

అక్టోబర్ 19 గురువారం: అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ

అక్టోబర్ 20 శుక్రవారం: వేపకాయల బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు వేపకాయల బతుకమ్మ

అక్టోబర్-21 శనివారం: ఆశ్వయుజ మాసం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మ జరుపుకుంటారు.

అక్టోబర్-22 ఆదివారం: సద్దుల బతుకమ్మ

ఆఖరి రోజున సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున చాలా పెద్ద బతుకమ్మను తయారు చేసి ఎంతో బాధతో నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే అక్కడితో ఆ ఏడాది బతుకమ్మ అయిపోతుంది కాబట్టి. ఈ పండుగకు ఉన్న ప్రత్యేక మరే పండుగకు ఉండదు.

Tags:    

Similar News