మూల నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

పెళ్లి అనగానే ముందుగా గుర్తు వచ్చేది జాతకాలు. పెళ్లి అనుకున్నప్పుడే మన కుటుంబ సభ్యులు జాతకాలు వెతకడం మొదలు పెడుతుంటారు. అయితే కొంత మంది పెద్దవారు అంటుంటారు

Update: 2023-04-13 05:58 GMT

 దిశ, వెబ్‌డెస్క్ :  పెళ్లి అనగానే ముందుగా గుర్తు వచ్చేది జాతకాలు. పెళ్లి అనుకున్నప్పుడే మన కుటుంబ సభ్యులు జాతకాలు వెతకడం మొదలు పెడుతుంటారు. అయితే కొంత మంది పెద్దవారు అంటుంటారు, మూల నక్షత్రంలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోకూడదు, ఆ నక్షత్రంలో పుట్టిన వారిని చేసుకుంటే ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయని అంటుంటారు.

అయితే దీనిపై శాస్త్ర వేత్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.శాస్త్ర పరంగా చూసుకున్నట్టయితే మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అదృష్ట వంతుడు అని శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంత మంది బయట తెలిసి తెలియక మూల నక్షత్రంలో చేసుకున్న వారి ఇంట్లో అలా జరిగిందని లేనిపోని అపోహలు పుట్టిస్తూ ఉంటారు. అవన్నీ అపోహలే, మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉన్నారు. వారిది నష్టజాతకమే అయితే వాళ్లు తమ జీవితంలో ఎలా సక్సెస్ అవుతారంటూ చెప్పుకొచ్చారు.మూల నక్షత్రంలో పుట్టిన వారు నష్ట జాతకులు, వారిని చేసుకుంటే మంచి జరగదు అన్నవి అన్ని అపోహలే అలాంటిది ఏం ఉండదు అని పండితులు చెబుతున్నారు.

Also Read: ఇంట్లోకి పిచుకలు రావడం మంచిదేనా?

Also Read: చనిపోయిన వారు కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Tags:    

Similar News