చనిపోయే ముందు చివరిగా మాట్లాడే మాటలు ఏంటో తెలుసా..? స్టడీలో నమ్మలేని నిజాలు

మనుషులకు చావు ముందుగానే తెలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Update: 2023-04-11 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనుషులకు చావు ముందుగానే తెలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వారి చనిపోయే 5 నిమిషాల ముందు చావు వారి కంటికి కనపడుతుందట. అయితే ఆ సమయంలో చనిపోయే వ్యక్తులు ఏం ఆలోచిస్తారు..? దేని గురించి మాట్లాడతారు..? అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆ సమయంలో వారు ఏం మాట్లాడతారు అనే విషయం తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన సైంటిస్టులు తాజాగా ఓ స్టడీ చేశారు. ఆ నివేదిక ఆధారంగా అసలు చనిపోయే ముందు వ్యక్తులు దేని గురించి ఆలోచిస్తారు.. వారు చివరగా ఏం మాట్లాడతారు అనేవి తెలుసుకుందాం..

* చాలా మంది పిల్లల ప్రేమకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు చనిపోయే చివరి క్షణాన పిల్లల్ని చూడాలని, వారితో మాట్లాడాలని ఏడుస్తారట.

* ఇప్పటి వరకు జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని.. వారు చేసిన తప్పులకు పశ్చాతాపంతో కుమిలిపోతుంటారు. జీవితంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారికి క్షమాపణలు చెప్పుకుంటారు.

* అంతే కాకుండా తమకు ఇష్టమైన వ్యక్తులను వారి పేర్లను పదే పదే గుర్తుతెచ్చుకుంటారు.

*ఇంకొంత మంది మాత్రం తమ జీవితంలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటారు. పిల్లలు, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన క్షణాలను గుర్తుతెచ్చుకుని సంతోషంగా కన్ను మూస్తారు. 

Read more:

వేసవిలో ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Tags:    

Similar News