హాస్పిటల్, క్లినిక్ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా..
హాస్పిటల్స్, క్లినిక్స్ ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
దిశ, ఫీచర్స్ : హాస్పిటల్స్, క్లినిక్స్ ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయినా ఈ రెండు కూడా హెల్త్ కేర్ సిస్టంలో చాలా ముఖ్యమైనవి. అయితే క్లీనిక్స్ లో, హాస్పిటల్స్ లో అందించే వైద్య సేవలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటి మధ్యలో ఉండే వ్యత్యాసాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లినిక్లలో సమస్యను బట్టి చాలా రకాలుగా ఉంటాయి. ఫిజికల్ థెరపీ క్లినిక్స్, అడిక్షన్ క్లినిక్స్, ప్రైమరీ కేర్ క్లినిక్స్, సెక్సువల్ హెల్త్ క్లినిక్స్ అంటూ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఈఎన్టీ, డెంటల్, స్కిన్ కి సంబందించిన వాటిని క్లినిక్ అంటారు. అయితే ఇక్కడ పేషెంట్లు 24 గంటల పాటు డాక్టర్ పర్యవేక్షణలో రెండు, మూడు రోజుల పాటు ఉండేందుకు వీలుండదు. అలాగే క్లీనిక్ లలో 24 గంటలు నర్సుల మానిటరింగ్, బెడ్స్, పెషెంట్ కి ప్రత్యేక గదులు అస్సలు ఉండవు. కేవలం రెండు, మూడు గంటల పాటు ఉండేందుకు, ఒక సెలైన్ ఎక్కించుకునేందుకు వీలుగా ఉంటుంది. అలాగే 24 గంటలూ తెరిచి ఉండవు. కొన్ని క్లినిక్స్ లలో ఆదివారం సెలవుగా ప్రకటించి క్లోస్ చేస్తారు.
ఇక ఆసుపత్రి విషయానికొస్తే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కే చికిత్సల కోసమే రావాల్సి ఉంటుంది. ఇవి రోజుకు 24 గంటలు, వారంలో అన్ని రోజులూ తెరిచే ఉండి, వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే వైద్యులను కలవాలంటే అపాయింట్మెంట్లు కూడా ఉండడం చాలా అవసరం. పెద్ద పెద్ద ఆపరేషన్లు, సర్జరీలు కూడా ఆసుపత్రిలోనే నిర్వహిస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా వైద్యులు ఉంటారు. అతి పెద్ద బిల్డింగులో హంగు ఆర్భాటాలతో ఉంటాయి. హాస్పిటల్ లో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ లు కూడా ఉంటారు. ఆసుపత్రలు క్లీనిక్ ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఎక్కువ బెడ్స్ సౌకర్యం, 24 గంటలపాటు అందుబాటులో వైద్యసిబ్బంది ఉంటారు. అక్కడికి వచ్చిన రోగులను నిరంతరం మానిటరింగ్ చేస్తూ వైద్యం అందిస్తూ ఉంటారు. హాస్పిటల్స్ క్లినిక్స్ తో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి.