Curd Rice : వేసవిలో పెరుగు తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా..

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

Update: 2024-03-13 06:08 GMT

దిశ, ఫీచర్స్: పెరుగు ఒక అద్భుతమైన వేసవి ఆహారమని చెప్పుకోవాలి. ఎందుకంటే, వేసవిలో తీసుకునే పెరుగు మన శరీరాన్ని చల్లపరస్తుంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పెరుగులో నీరు ,ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి అనారోగ్యానికి గురి కాకుండా చేస్తుంది. దీనిలో ఉండే ప్రొటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది . శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.పెరుగు తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1. శరీరాన్ని చల్లపరుస్తుంది

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

3. రోగనిరోధక శక్తి

పెరుగులో ఉండే పోషకాలు మరియు ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

4. డీహైడ్రేషన్ నివారిస్తుంది

పెరుగులో చాలా నీరు ఉంటుంది, ఇది డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

5. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పెరుగులో ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి, ఇది మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

6. చర్మ ప్రయోజనాలు

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News