పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కంటి నిండా, సరిపడ నిద్రపోవాలని చెబుతుంటారు. అయితే కొంత మంది అస్సలే నిద్రపోరు. దీంతో వారు ఆనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉంటుంది. అయితే పెద్దవారికి ఎలాగైతే

Update: 2024-05-31 08:04 GMT

దిశ, ఫీచర్స్ : నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కంటి నిండా, సరిపడ నిద్రపోవాలని చెబుతుంటారు. అయితే కొంత మంది అస్సలే నిద్రపోరు. దీంతో వారు ఆనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉంటుంది. అయితే పెద్దవారికి ఎలాగైతే నిద్ర అవసరమో, చిన్న పిల్లలకు కూడా అంతే అవసరం. చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకే పసివారు ఉన్న దగ్గర ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మంచి వాతావరణం ఉండేలా చూసి వారిని పడుకోబెడతారు. అయితే చిన్న పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? వారు ఎంత సేపు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

 అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు. వారు ఎప్పటికీ పడుకొనే ఉంటారు. మధ్య మధ్యలో లేచి పాలు తాగడం పడుకోవడం అంతే . అయితే వీరు రోజుకు 12 నుంచి 18 గంటలు నిద్రపోవాలంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇక రెండో నెల నుంచి 12 నెలల మధ్య గల పసిపిల్లలు రోజుకు 14 నుంచి 15 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇక 1 నుంచి 3 సవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకు 12 నుంచి 14 గంటలు నిద్రపోవాలంట. అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాలు రోజుకు 11 నుంచి 13 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 7 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు 10 నుంచి 11 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.13 నుంచి 19 సంవత్సరాలు గల టీనేజర్లకు ప్రతిరోజూ 8.5 నుంచి 9.5 గంటల నిద్ర అవసరమవుతుంది. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.


Similar News