Curd: పెరుగులో జీలకర్ర వేసి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

పెరుగులో జీలకర్ర వేసి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

Update: 2024-08-07 08:54 GMT

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మందికి పెరుగు తిననదే భోజనం సంపూర్ణం కాదు. దీన్ని ప్రతి రోజూ తీసుకుంటాం.. ఎందుకంటే పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మలబద్ధక సమస్యలతో బాధ పడేవారు పెరుగు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, పెరుగుతో జీలకర్ర కలిపి తీసుకుంటే మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

పెరుగుతో జీలకర్ర మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకలి లేని వారు జీలకర్ర పొడిని తీసుకుంటే మంచిగా పని చేస్తుంది.

పెరుగుతో జీలకర్రను కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు చేస్తుంది. దీనిలో ఉండే ఉండే ఖనిజాలు ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అంతే కాకుండా ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. డయాబెటిస్‌ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News