గట్టిగా దగ్గడంతో బాంబులాగా పేలిపోయిన ప్రేగులు.. బయటకు వచ్చేశాయి..

అమెరికాకు చెందిన 63ఏళ్ల వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో గట్టిగా దగ్గు, తుమ్మడంతో.. ప్రేగులు బయటకు వచ్చినట్లు ఓ సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. ఆ

Update: 2024-06-09 07:07 GMT

దిశ, ఫీచర్స్: అమెరికాకు చెందిన 63ఏళ్ల వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో గట్టిగా దగ్గు, తుమ్మడంతో.. ప్రేగులు బయటకు వచ్చినట్లు ఓ సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. ఆ టైంలో తీవ్రమైన నొప్పితో బాధపడినట్లు.. పొట్ట లోపల తడిగా ఉన్నట్లు అనిపించడం, ప్రేగులు వేలాడినట్లు కావడంతో వెంటనే హాస్పిటల్ వెళ్లగా.. ఎమర్జెన్సీ అవసరమైనట్లు తెలిపింది. సర్జరీ తర్వాత మళ్లీ సెట్ అయినట్లు సమాచారం. కాగా ఈ పరిస్థితిని డిస్ ఎంబౌల్మెంట్ గా పిలుస్తారని చెప్పారు.

అసలు ఎందుకిలా జరుగుతుంది?

అబ్ డామినల్, పెల్విక్ సర్జరీలు జరిగిన తర్వాత గాయం సరిగ్గా మాననప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇది రేర్ కండిషన్ అని.. 100 మందిలో ముగ్గురికి ఇలా జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు నిపుణులు. అధిక రక్తస్రావం, దీర్ఘకాలికంగా వేధిస్తున్న నొప్పి, ఎక్స్ పోజ్ అయిన అవయవాలకు గాయం అయినప్పుడు మరణం కూడా సంభవించవచ్చు. అందుకే సర్జరీ అయ్యాక దగ్గు, తుమ్ములు, వెక్కిళ్లు ఉంటే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.


Similar News