కాలి చూపుడు వేలు పెద్దగా ఉన్న మహిళలు అలా ప్రవర్తిస్తారా..? సైంటిస్ట్‌లు చెబుతుంది ఇదే!

మనుషులందరికి ఒకే శ‌రీర అవ‌య‌వాలు ఉంటాయి.

Update: 2023-08-11 08:34 GMT

దిశ, వెబ్ డెస్క్: మనుషులందరికి ఒకే శ‌రీర అవ‌య‌వాలు ఉంటాయి. కానీ కొందరికి కొన్ని అవ‌య‌వాలు ప్ర‌త్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా కాలి బొట‌న వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటుంది. ఇలా ఎక్కువగా మ‌హిళ‌ల‌కు ఉంటుంది. ఎక్కడైనా ఇలాంటి మహిళలను చూసినప్పుడు వారి భర్తలను కంట్రోల్లో పెడతారని అందరూ నమ్ముతుంటారు. దీని గురించి సైంటిస్టులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

కాలి బొట‌న వేలి క‌న్నా చూపుడు వేలు ఎక్కువ పొడ‌వుగా ఉంటే వైద్య ప‌రిభాష‌లో 'మోర్ట‌న్స్ టో' అని పిలుస్తారు. అమెరికాకు చెందిన సైంటిస్టు జాయ్ మోర్ట‌న్ ఇలాంటి స్థితిని గుర్తించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇది జ‌న్యు సంబంధ కార‌ణాల వ‌ల్లే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని.. అంతేకానీ.. దీనిలో ఎలాంటి మూఢ న‌మ్మ‌కాలు లేవని అంటున్నారు. కాలి బొట‌న వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే అలాంటి మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌పై గెలుస్తారని అన‌డంలో అర్థం లేద‌ని.. ఇది నిజం కాద‌ని తేల్చి చెప్పేసారు. మహిళలకు భిన్న‌మైన అవ‌య‌వాలు ఆకారంలో, రంగులో మార్పుల‌కు గురై ఉంటాయ‌ని.. వీటిల్లో మూఢ విశ్వాసాల‌ను పాటించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. 

Read More:  జాజికాయ‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది! 


Similar News