పిల్లల జ్ఞాపకశక్తి మెరుగు పడాలా.. పేరెంట్స్ పిల్లలకు ఈ పనులు అలవాటు చేస్తే చాలు

మనుషుల్లో మతిమరుపు అనేది కామన్.

Update: 2024-09-18 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనుషుల్లో మతిమరుపు అనేది కామన్. మతిమరుపు అనేది మూడు రకాలు. యాంటిరోగ్రేడ్ స్మృతి, తిరోగమన స్మృతి, డిసోసియేటివ్ స్మృతి. స్ట్రెస్, ఆందోళ కారణంగా మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. కాగా దీని ప్రభావం మెదడుపై చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి వస్తుంది.

ఏ వస్తువు ఎక్కడ పెట్టినా మర్చిపోతుంటారు. ఏదో పని చేయబోయ్ ఏమో పని చేస్తారు. ఎవరైనా ఏమైనా చెబితే.. మరో వ్యక్తి మధ్యలో వచ్చి మట్లాడగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. అయితే ఈ ప్రాబ్లం కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారు.

పిల్లలు కూడా ప్రస్తుత రోజుల్లో ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతున్నారు. దీంతో స్టడీపై దృష్టి సారించలేకపోతున్నారు. చదివిన విషయాలు మర్చిపోతున్నారు. సబ్జెక్ట్ గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాగా పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే పేరెంట్స్ వారికి ఈ పనులు అలవాటు చేయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధ్యానం..

ప్రతిరోజూ పిల్లలతో కనీసం 10 నిమిషాలు అయినా ధ్యాయం చేయించండి. దీంతో మనసు తేలిక అయిపోతుంది.

వ్యాయామం..

జ్ఞాపకశక్తిని పెంచడంలో వ్యాయామం సూపర్‌గా పనిచేస్తుంది. కేవలం బాడీనే కాకుండా మనసు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే యోగా, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి కూడా పిల్లలతో చేయించండి.

బ్రెయిన్‌కు సంబంధించిన ఆటలు..

సుడోకు, పజిల్ సాల్వింగ్, చెస్ వంటి ఆటలు ఆడించండి. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

సమయపాలన..

క్రమశిక్షణ అనేది పిల్లలకు చాలా అవసరం. కాగా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలంటే టైమింగ్ సెన్స్ అనేది చాలా అవసరం. ఒక పనిని చేయాల్సిన సమయానికి చేసినట్లైతే పిల్లలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ వస్తుంది.

ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి..

జ్ఞాపకశక్తి పొందాలంటే కేవలం వ్యాయామాలు, ధ్యానం మాత్రమే కాకుండా నాణ్యమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం పిల్లలకు పెట్టాలి. మెదడుకు పోషకాలు అందితే పిల్లల జ్ఞాపకశక్తి అటోమెటిక్‌గా మెరుగుపడుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News