Teenage angst : టీనేజ్‌లో కోపం ఎక్కువా..? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే..

టీనేజ్ అంటేనే అదో ఉరకలెత్తే ఉత్సాహామని పెద్దలు, నిపుణులు అంటుంటారు. ఈ వయస్సులో కోపం, చిరాకు తదితర భావోద్వేగాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్తారు.

Update: 2024-09-10 12:43 GMT

దిశ, ఫీచర్స్ : టీనేజ్జ్ అంటేనే అదో ఉరకలెత్తే ఉత్సాహామని పెద్దలు, నిపుణులు అంటుంటారు. ఈ వయస్సులో కోపం, చిరాకు తదితర భావోద్వేగాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్తారు. శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం, ఒత్తిడి, ఆందోళన వంటివి పిలల్లో మానసిక సంఘర్షణకు దారితీయడమే ఇందుకు కారణం. దీంతో ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ ప్రదర్శిస్తుంటారు కూడా చేస్తుంటారు కొందరు. అయితే పిల్లల కోపాన్ని కంట్రోల్ చేయడానికి నిపుణుల ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

అవగాహన కల్పించాలి

టీనేజర్స్‌లో కోపం, అతి భావోద్వేగాలకు కారణం వారిలో కలిగే మానసిక సంఘర్షణ కూడా కారణం. అలాగే పిల్లలు చాలా విషయాలు తమ తల్లిదండ్రులు, కుటుంబంలోని ఇతర సభ్యులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ తరచుగా ఒకరిపై ఒకరు కోపంగా అరుచుకోవడం, పిల్లలపై కూడా కోపాన్ని ప్రదర్శించడం వంటివి వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు అస్లు చేయకూడదు. ఎందుకంటే వారు కూడా అవే అలవాట్లను, ప్రవర్తనను అలవర్చుకునే అవకాశం ఎక్కువ. యుక్త వయస్సు కాబట్టి కాస్త కోపాన్ని ఎక్కువే ప్రదర్శిస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లతో వ్యవహరించే తీరు మార్చుకోవాలి. వారితో కోపంగా కాకుండా ప్రేమగా, స్నేహ పూర్వకంగా మసలుకోవాలి. ఏ విషయంలో ఎలా ఉండాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో వివరించాలని నిపుణులు సూచిస్తు్న్నారు. ముఖ్యంగా మానసిక, శారీరక ఆరోగ్యాలపై అవగాహన కల్పించాలి.

వారిని చెప్పనివ్వండి

అసలే యుక్త వయస్సు. బయటి సమాజంలో చూసిన విషయాలు, స్నేహితుల ద్వారా నేర్చుకున్న అంశాలు, సినిమాలు, టీవీల్లో చూసే ప్రోగ్రాముల ప్రభావం వంటివి పిల్లలపై పడుతుంటాయి. అయితే కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను సందేహాలు అడగడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ‘‘నోర్ముయ్, అలాంటివి నీకెందుకు? ఇతరుల విషయాలు ఎందుకు? ముందు బాగా చదువుకో, చెప్పిన పని చెయ్ ముందు’’ వంటి మాటలతో పిల్లలపై కోప్పడుతుంటారు. అలాగే పిల్లలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, సందేహాలను వ్యక్తం చేయడాన్ని అడ్డుకుంటూ ఉంటారు. దీంతో తమ పేరెంట్స్‌కి ఏమీ తెలియదని, లేకపోతే వారు తమకు చెప్పరని భావించి వ్యతిరేకతను పెంచుకుంటారు. దీంతో తల్లిదండ్రులు ఏది చెప్పినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది గమనుక పిల్లల్లో గమనిస్తే తల్లిదండ్రులు వారిని బెదిరించడం, కొట్టడం ద్వారా మార్చాలనే ప్రయత్నం అస్సలు మంచిది కాదు అంటున్నారు మానసిక నిపుణులు. అలా చేస్తే సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువట. అందుకే పిల్లలు తమ భావాలను తల్లిదండ్రులతో వ్యక్తం చేయడానికి భయడపని వాతావరణం క్రియేట్ చేయాలి.

పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినండి!

యుక్త వయస్సు పిల్లలు కోపంగా ఉన్నారనో, వారు చెప్పేది సరైంది కాదనో వెంటనే వ్యతిరేకించడం, మధ్యలోనే కట్ చేయడం వంటివి తల్లిదండ్రులు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ముందు పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినాలని, తర్వాత మంచీ చెడూ వారికి అర్థం అయ్యేలా వివరించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా గట్టిగా మందలించాలనుకుంటే పిల్లలు మారే అవకాశం టీనేజ్‌లో చాలా తక్కువ. దీంతోపాటు పిల్లలపై అరవడం, గొడవకు దిగడం, తప్పుచేస్తే ఊరికే శిక్షించడం వంటివి చేయకుండా ఫ్రెండ్లీగా ఉంటూ డీల్ చేయడమే చక్కటి మార్గంగా మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక పిల్లల్లో అతి భావోద్వేగాలు, కోపాన్ని కంట్రోల్ చేయడంలో ఇబ్బందులు పడుతుంటే.. వారి ప్రవర్తన ప్రమాదకరమని భావిస్తే గనుక సైకాలజిస్టులను సంప్రదించడం ఉత్తమం.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News