చింతపండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా?
మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు కూడా మనకి ఔషధంగా ఉపయోగపడతాయి.
దిశ, వెబ్ డెస్క్: మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు కూడా మనకి ఔషధంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో చింతపండు కూడా ఒకటి. మనం చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కొంత మంది అయితే ఇది లేనిదే కూర కూడా వండుకోరు.. కొంచమైనా వేసుకుంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా.. అవేంటో ఇక్కడ చూద్దాం..
1.చింత పండు రసంతో పులిహోర చేసుకొని తింటుంటాము. దీనిలో పోషకాలు ఇంకే ఆహార పదార్ధాలలో ఉండవు. అంతే కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి.
2. చింతపండును ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కానీ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలను సైతం ఈ చింతపండు గ్రహిస్తుంది.
3. దీని రసంతో చారు చేసుకొని తింటే లివర్ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి రోగాల బారిన పడకుండా చేస్తుందట.
4. గుండె పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.
5. చింతపండు నీరులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తాగడం వల్ల గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read : బ్లూ టీ తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?