Fasting : కార్తీక మాసంలో ఉపవాసం మంచిదే.. కానీ ఎవరు ఉండకూడదో తెలుసా?

హిందూ క్యాలెండర్‌లో ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉంటుంది.

Update: 2024-11-05 07:39 GMT

దిశ, ఫీచర్స్: హిందూ క్యాలెండర్‌లో ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని మాసాలకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అటువంటి వాటిలో కార్తీక మాసం కూడా ఒకటి. నవంబర్ 2వ తేదీ నుండి ఈ మాసం ప్రారంభమైంది. దీపాల కాంతులతో కళకళలాడే ఆలయాలు, శివనామస్మరణలు, నదీ స్నానాలు, పూజలు, ఉపవాసాలు కార్తీక మాస ప్రత్యేకతలు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించడే ఈ నెలలో పూజలు, ఉపవాసాలకు విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.హిందూ క్యాలెండర్‌లో ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉంటుంది.

శికేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో భగవంతుని ఆశీస్సులు పొందడం కోసం మహిళలు ఉపవాస దీక్షను ఆచరిస్తుంటారు. అయితే, ఈ ఫాస్టింగ్ ఎవరు చేయాలి? ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

వీళ్లు అస్సలు ఉపవాసం చేయకూడదు: అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 18 ఏళ్లలోపు వారు ఈ ఉపవాసానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్న వాళ్లు ఉపవాసం చేస్తుంటే..రెగ్యులర్‌గా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. గర్భినీలు, పిల్లలక పాలు ఇచ్చె తల్లులు ఫాస్టింగ్‌కి బ్రేక్ ఇవ్వాలని నిపుణులు తెలియజేశారు.

ఇలా చేయండి: ఉపవాస సమయంలో ఎక్కువగా కష్టపడి పని చేయకపోవడమే మంచిది. లేదంటే శరీరం బలహీనంగా మారి, నీరసించిపోతారు. ఇలాంటి సమయంలో ఫాస్టింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఆహారం తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఇక, కొత్తగా ఉపవాసం ఉన్న వాళ్లు రోజులో ఓ పూట భోజనం చేసేలా చూసూకోవాలి. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నట్లైతే, ఫుడ్ తీసుకోకపోయినా జ్యూస్, పళ్లు వంటివి తీసుకుంటే మంచిది.

డీ హైడ్రేషన్‌కు గురయ్యే చాన్స్: కొందరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. అలా ఎప్పుడూ ఉండకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వర్క్ చేసే వారు ఖచ్చితంగా జ్యూస్ లేదా ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

ఉపవాసం ఎలా చేయాలంటే..?

ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండాలి అనే నియమం ఎక్కడా లేదని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని, వయస్సునుబట్టి పండ్లు, పాలు వంటివి తీసుకుంటూ ఫాస్టింగ్ చెయ్యవచ్చు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారు అయినా అప్పుడప్పుడు మంచి నీటిని తాగడం మంచిది. ఉపవాసం అనేది అందరూ చేయాలి అనే రూల్ ఏమి ఉండదు. అది వ్యక్తిగత నిర్ణయం. ఆరోగ్య ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండడం కూడా మంచిదని నిపుణులు చెబుతుంటారు.

Tags:    

Similar News