Classy Looks : క్లాసీ లుక్స్ .. అలంకరణ, వస్త్రధారణలో మహిళల సరికొత్త ఫ్యాషన్ క్రేజ్!

Classy Looks : క్లాసీ లుక్స్ .. అలంకరణ, వస్త్రధారణలో మహిళల సరికొత్త ఫ్యాషన్ క్రేజ్!

Update: 2024-11-04 13:52 GMT

దిశ, ఫీచర్స్ : ఆధునిక ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ పోకడలకే అధిక ప్రాధాన్యం ఉందనుకుంటారు కొందరు. కానీ ఇది వందశాతం నిజం కాదంటున్నారు నిపుణులు. అలంకరణ మొదలు కొని వస్త్ర ధారణ వరకు క్లాసీ లుక్స్ అండ్ స్టైల్స్‌ను ఫాలో అయ్యే ఆధునిక స్త్రీలు చాలా మందే ఉంటున్నారు. అటు పూర్తి సంప్రదాయ బద్ధంగానో, ఇటు పూర్తి ఆధునిక పోకడలనో వీరు ఫాలో అవరు. తమకు ఏది నప్పుతుందో, ఏది కంఫర్ట్‌గా ఉంటుందో దానినే అనుసరిస్తారు. కాలానుగుణంగా నడుచుకుంటూనే అలంకరణలో, అలవాట్లలో, వస్త్ర ధారణలో, పాత, కొత్త పోకడల కలయిను మేళవిస్తారు.

ఫ్యాషన్ ప్రపంచంలో క్లాసీ లుక్ ఇష్టపడే మహిళలు నిజానికి కాలాతీత గాంభీర్యాన్ని వెదజల్లే గొప్ప ఆకర్షణ కలిగి ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇది కేవలం వారు ధరించే దుస్తుల విషయంలోనే కాదు, వారి మనస్తత్వం, క్రమశిక్షణ, అలవాట్లలో కూడా కనిపిస్తుందని చెప్తారు. అందుకే తమ వార్డ్ రోబ్‌ను క్యూరేట్ చేయడం నుంచి సెల్ఫ్ కేర్ ప్రయారిటీస్ వరకు క్లాసీ లుక్ ఇష్టపడే స్త్రీలు ప్రత్యేకతను కలిగి ఉండటం అందరూ మెచ్చుకోదగ్గ ఫ్యాషన్‌గా చలామణి అవుతోంది.

సింప్లిసిటీ పవర్‌

నిజానికి కాలాతీత క్లాసీ లుక్ అనేది ఆధునిక ట్రెండ్స్‌ను ఫాలో అవడం లేదా వ్యతిరేకించడం అస్సలు కాదు. అలాగే గత పోకడలను అనుసరించడం, సమర్థించడం కూడాను కాదు. వాటిని గౌరవిస్తూనే, వాటిని మేళవిస్తూనే సరికొత్త స్టైల్‌ను ఫ్రేమ్ చేసుకొని మెయింటైన్ చేయడమే దీనిని పాటించేవారి ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటే సింప్లిసిటీ పవర్‌ను వీరు చక్కగా అర్థం చేసుకుంటారు. అంటే ఆధునిక నమూనాలకు బదులు ఆకట్టుకునే నమూనాలనే ఇష్టపడతారు. స్టేట్‌మెంట్ నగలకు బదులుగా సాధారణ నగలను ధరిస్తారు. అలాగే మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విషయంలోనూ క్లాసీ లుక్ ఇష్టపడే స్త్రీలు తమ ఇష్టాన్ని బట్టి నడుచుకుంటారు తప్ప పాత, కొత్త పోకడలను ఫాలో అవరు. అయినప్పటికీ వీరు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి మించిన ఆకర్షణతో ఆకట్టుకుంటారు.

క్వాలిటీ ముఖ్యం

క్లాసీ లుక్ స్టైల్‌‌ను అనుసరించే మహిళలు వస్త్ర ధారణ, అలంకరణ, అలవాట్లు ఇలా ఏ విషయంలోనైనా సరే పరిమాణం కంటే నాణ్యతకు, హుందాతనానికి ప్రాధాన్యత ఇస్తారు. మారుతున్న ట్రెండ్‌తో తమ వార్డ్‌రోబ్‌ను నింపాలని భావించరు. తక్కువ దుస్తులు, వస్తువులతోనే క్లాసీగా కనిపించాలని అనుకుంటారు. కొనుగోలు విషయంలోనూ అదే చేస్తారు. నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడరు.

వస్త్రధారణలో ప్రత్యేక శైలి

ఫ్యాషన్స్ వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ సొగసు లేదా ప్రత్యేకత అనేది ఎప్పటికీ ఉంటుంది. కాలాతీత క్లాస్ లుక్‌ని మెయింటైన్ చేసే మహిళలు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటారు. లేటెస్ట్ ట్రెండ్స్‌లో మునిగిపోయే బదులు వారు తమకు పనికివచ్చే వాటికే కట్టుబడి ఉంటారు. తమ శరీర ఆకృతి, రంగు, వ్యక్తిగత ఆసక్తిని తమకు బట్టి ఏ కలర్స్ నప్పుతాయో తగిన అవగాహన కలిగి ఉంటారు. ఆధునిక పోకడలకు అనుగుణంగానో, సంప్రదాయాలకు అనుగుణంగానో వస్త్రధారణ ఉండాలని అనుకోరు. ఆ రెండింటికి మించిన క్లాసీ లుక్ మెయింటైన్ చేస్తుంటారు. అంతేకాకుండా వీరు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వంటివి కలిగి ఉంటారు. 

Tags:    

Similar News