చర్మంపై చిన్నపాటి ఎర్రటి మచ్చలు.. మెలనోమా క్యాన్సర్‌గా గుర్తించిన నిపుణులు
డాక్టర్ అలెగ్జాండర్ విట్కోవ్‌స్కీ(Alexander Witkowski) డెర్మటాలజిస్టుల బృందం అరుదైన చర్మక్యాన్సర్‌ను గుర్తించింది.
దిశ, ఫీచర్స్: పోలాండ్‌లోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలెగ్జాండర్ విట్కోవ్‌స్కీ(Alexander Witkowski) ఆధ్వర్యంలోని డెర్మటాలజిస్టుల బృందం అరుదైన చర్మక్యాన్సర్‌ను గుర్తించింది. దానికి మెలనోమాగా(melanoma) పేరు పెట్టింది. మొదట ఈ సమస్యను క్రిస్టీ స్టాట్స్(Christy Staats) అనే మహిళ ఎదుర్కొన్నది. ఆమె కంటికింద అనుమానాస్పదమైన ఎర్రటి మచ్చ ఏర్పడటంతో డెర్మటాలజిస్టు డాక్టర్ విట్కోవ్‌స్కీను సంప్రదించింది.
దానిని పరీక్షించిన అతను 0.65 మి.మీ. పరిమాణంలో ఉన్న ఆ చిన్న మచ్చ దేనికి సంబంధించిందోనని అనేసార్లు పరిశోధనలు జరిపాడు. చివరగా మరికొందరు నిపుణులతో కలిసి దానిని అరుదైన ‘మెలనామా’గా కనుగొన్నాడు. అతి చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఈ క్యాన్సర్ కారక మచ్చ వెంటనే కంటికి కనబడదని, ప్రత్యేకంగా మైక్రోస్కోపు ద్వారా చూడాల్సి ఉంటుందని విట్కోవ్‌స్కీ పేర్కొన్నారు. ఇది సూర్యుని ద్వారా విడుదలయ్యే అతినీలలోహిత (UV) కాంతివల్ల సంభవించే ప్రాణాంతక చర్మ క్యాన్సర్లలో ఒకటి అని తెలిపాడు. ఇది ఛాతీ, వీపు, మెడ, ముఖం వంటి భాగాల్లో ఎక్కడైనా కనిపించవచ్చు. ఎన్నడూ లేనివిధంగా శరీరంలో ఎర్రటి, అతి చిన్న మచ్చలు కనిపించడమే ఈ వ్యాధి లక్షణం.
ఈ ఏడాది దాదాపు 97 వేలకుపైగా మెలనోమా క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంచనా వేసింది. అయితే వివిధ చర్మ క్యాన్సర్లతో పోల్చినప్పుడు మెలనోమా కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ కణాలు చర్మం బయటి పొరలో ఏర్పడిన తొలిదశలో గుర్తించినప్పుడు మాత్రమే చికిత్స ద్వారా నయం అయ్యే అవకాశం ఉంటుంది. ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు.
Read More: లిప్‌లాక్‌తో ఈ వ్యాధి బారిన పడ్డట్లే!