పిల్లలకు ఆవు పాలు తాగిస్తే ప్రమాదం.. ఏడాది లోపు పిల్లల పట్ల జాగ్రత్త.. !!

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం శిశువుకు ఆరు నెలల పాటు తల్లి పాలు అవసరం.

Update: 2023-04-19 09:19 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం శిశువుకు ఆరు నెలల పాటు తల్లి పాలు అవసరం. ఆ బిడ్డ ఎదుగుదలకు పునాదిగా మారుతున్న బ్రెస్ట్ ఫీడ్.. భవిష్యత్తులో పలు ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. ఆ పరిస్థితి లేదంటే మిల్క్ బ్యాంక్‌లో మరో తల్లి పాలను కొనుగోలు చేసి బిడ్డకు తాగించాలని సజెస్ట్ చేస్తున్న నిపుణులు.. ఆవు లేదా గేదె పాలను మాత్రం తాగించకూడదు అంటున్నారు. ఒకవేళ ఏడాది లోపు పిల్లలకు ఈ పాలు తాగిస్తే రక్త హీనత, మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే..?

* తక్కువ ఐరన్ కంటెంట్ కలిగిన ఆవు లేదా గేదె పాలు బిడ్డ గ్రోత్‌ను అడ్డుకుంటాయి.

* 40 శాతం మంది శిశువుల్లో పేగు రక్త నష్టానికి కారణం.

* కాల్షియం, కేసిన్ అధికంగా ఉండటం మూలంగా ఐరన్ శోషించడాన్ని అడ్డుకుంటాయి.

* బిడ్డకు కావాల్సిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ఉండే హై ప్రోటీన్.. కిడ్నీలపై అనవసరమైన భారాన్ని కలిగిస్తుంది.

* మొత్తానికి ఆవు/గేదె పాలు తాగించడం మూలంగా శిశువుకు అనీమియా(రక్తహీనత), డీహైడ్రేషన్ కలుగుతుంది.

Also Read..

వీర్యం కావలెను.. ఆ ఏజ్ పురుషులకే ప్రయారిటీ

Tags:    

Similar News