సెక్స్ చేసినా గర్భం రాకుండా ట్రై చేస్తున్న జంటలు !

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ప్రేమ, రిలేషన్‌షిప్‌లతో సెక్స్ కామన్ అయిపోయింది.

Update: 2023-05-20 10:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ప్రేమ, రిలేషన్‌షిప్‌లతో సెక్స్ కామన్ అయిపోయింది. రిలేషన్‌ షిప్ మెయింటైన్ చేసేవారు సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, గర్భం వస్తుందని భయపడిపోతుంటారు. అలాగే కొంత మంది కొత్తగా పెళ్ళైన జంటలు కూడా జాబ్, చదువు రీత్యా సెక్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందనే భయంతో దూరంగా ఉంటారు. మరి కొంత మంది సెక్స్ చేసుకున్నా కొంత కాలం పిల్లలు వద్దనుకుంటారు. అయితే ఒక్కోసారి వారికి తెలియకుండానే సెక్స్‌లో పాల్లొని గర్భం దాలుస్తారు. నిండు ప్రాణాన్ని చంపడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను కంటారు. అయితే గర్భం దాల్చకుండా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ట్రిక్స్ పాటిస్తే మీ భాగస్వామితో ఫుల్ ఎంజాయ్ చేయోచ్చట.

* మీ భాగస్వామితో సెక్స్ చేయాలనుకున్నప్పుడు కండోమ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. అలా చేసి సంభోగంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉండదు.

* సెక్స్ చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించి గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది.

* అమ్మాయిలు పీరియడ్స్ మొదలైన మొదటి రోజు నుంచి లెక్కపెడితే 9వ రోజు నుంచి 18వ రోజు వరకు సెక్స్‌లో పాల్గొనకుండా ఉండాలి. దీనిని ఫాలో అయితే గర్భధారణను దాటవేయవచ్చు.

*కొంత మంది గర్భనిరోధక మందులు వాడితే ప్రెగ్నెన్సీ వస్తుందనే ఆందోళన ఉంటుంది. అలాంటి వారు పీరియడ్స్ టైమ్ సెక్స్‌లో పాల్గొనవచ్చు.

*సెక్స్ సమయంలో, కొన్నిసార్లు కండోమ్ లేకుండా, పురుషులు సంభోగంలో పాల్గొంటారు. ఈ క్రమంలో యోని లోపల కాకుండా పైన స్కలనం చేస్తుంటారు. అలా చేసినా గర్భం దాల్చే అవకాశం ఎక్కువ. కాబట్టి అలా చేయకపోవడమే బెటర్.

*గర్భం రాకుండా సెక్స్ చేయాలనుకుంటే, స్త్రీలు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఇంజక్షన్ ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా వేసుకోవాలి.

* అయితే కొంత మంది కండోమ్‌తో సెక్స్ చేసేటప్పుడు పురుషాంగాన్ని ఎక్కువ సేపు యోనిలో ఉంచితే రంధ్రం పడి ఫలదీకరణం చెందుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Also Read..

మీకు ఇలాంటి కల వచ్చిందా.. అయితే ఎవరికీ చెప్పకండి

Tags:    

Similar News