Great Wall of China : చైనా గ్రేట్ వాల్ కు కన్నం.. సిల్లీ రీజన్ తో పూడ్చలేని నష్టం

చైనా గ్రేట్ వాల్.. అంతరిక్షం నుంచి కనిపించే అతి తక్కువ మానవ నిర్మిత నిర్మాణాలలో ఒకటి

Update: 2023-09-12 05:57 GMT

దిశ, ఫీచర్స్: చైనా గ్రేట్ వాల్.. అంతరిక్షం నుంచి కనిపించే అతి తక్కువ మానవ నిర్మిత నిర్మాణాలలో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి అనేక మంది రాజవంశీయులు శతాబ్దాలపాటు నిర్మించిన రక్షణ గోడ. కాగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. అయితే ఇద్దరు ఉద్యోగులు.. ఇంత గొప్ప నిర్మాణానికి కన్నం పెట్టారు. తమ గమ్యస్థానానికి వెళ్లాలంటే రోజు గోడ చుట్టూ తిరగాల్సి వస్తుందని తొలిచేసారు.

అప్పటికే ఉన్న రంధ్రాన్ని పెద్దదిగా చేసి.. పూడ్చలేని నష్టం కలిగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 35 ఏళ్ల పురుషుడు, 50 ఏళ్ల మహిళ ఈ పని చేశారు. గోడ చుట్టూ తిరగకుండా నేరుగా తమ ఎక్స్‌కవేటర్‌ను నడపాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు కన్ స్ట్రక్షన్ వర్కర్స్. అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు. అయితే గోడ దెబ్బతినడం గురించి అప్రమత్తమైన తర్వాత.. షాంగ్సీ ప్రావిన్స్‌లోని పోలీసులు అనుమానితులు ఎక్స్‌కవేటర్ ట్రాక్‌లను అనుసరించారు. మొత్తానికి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రేట్ చైనా వాల్ ను మనుషులు డిస్టర్బ్ చేయడం ఇది తొలిసారి కాదు. 1950, 1960లలో తమ కన్ స్ట్రక్షన్ వర్క్ కోసం ఈ గోడ మెటీరియల్ యూజ్ చేశారు. 

Tags:    

Similar News