Sleeping bag: పిల్లల కోసం ఎలాంటి స్లీపింగ్ బ్యాగ్ వాడాలి.. దీని లాభాలు ఏంటి..?
చిన్న పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎటు వెళ్తున్నారని, ఏం చేస్తున్నారని పిల్లలపై ప్రతి నిమిషం నిఘా పెడుతుంటారు. సమ్‌టైమ్ వారికి తెలియకుండానే ఏవేవో వస్తువులు నోట్లో పెట్టుకోవడం, బెడ్‌పై నుంచి కిందపడడం.. ఈ చిన్న చిన్నవే పెద్ద పెద్ద ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చిన్న పిల్లల కోసం చాలా మంది స్లీపింగ్ బ్యాగ్స్ వాడుతుంటారన్న విషయం తెలిసిందే. కనీసం ఐదు నెలల వరకు అయినా ఈ బ్యాగ్ ఉపయోగిస్తారు. మరీ స్లీపింగ్ బ్యాగ్ వాడడం మంచిదేనా? ఎలాంటి బ్యాగ్ కొనాలి ? దీని లాభాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
స్లీపింగ్ బ్యాగ్ ఎందుకు ఉపయోగిస్తారంటే..?
చిన్న పిల్లల్ని స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోబెట్టడం ద్వారా వెచ్చగా ఉంటుంది. హాయిగా నిద్రిస్తారు. మళ్లీ సైడ్స్ నుంచి కిందపడకుండా సెఫ్టీగా ఉంటుంది. ప్రయాణం చేసే సమయంలో కూడా స్లీపింగ్ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఎత్తుకోవడానికి భయపడే తల్లులకు స్లీపింగ్ బ్యాగ్ బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పుకోవచ్చు. కాగా చిన్నపిల్లల కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి స్లీపింగ్ బ్యాగ్ కాస్త నాణ్యత గలది కొనుగోలు చేస్తే బెటర్.
ఎలాంటి స్లీపింగ్ బ్యాగ్ ఎంపిక చేసుకోవాలంటే..?
మనీ వేస్ట్ అని ఆలోచించకుండా నాణ్యత గల స్లీపింగ్ బ్యాగ్ కొనండి. ఒక్కసారి కొంటే ఎక్కువ రోజుల పాటు యూజ్ అవుతుంది. కాగా నాణ్యతను దృష్టిలో పెట్టుకుని స్లీపింగ్ బ్యాగ్ కొనండి. మజ్లిన్, కాటన్ వంటి వస్త్రాలతో తయారు చేసిన బ్యాగ్ కొనండి. కొన్ని ఇకో ఫ్రెండ్లీ వంటి రకాలు ఉంటాయి.ఇవి పిల్లలకు సౌరకర్యవంతంగా ఉంటాయి. పిల్లల చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అలాగే స్లీపింగ్ బ్యాగ్ ఎప్పుడైనా రంగులు తొందరగా మాసిపోయినట్లుగా కనిపిస్తాయి. కాగా ఎప్పుడైనా సరే స్లీపింగ్ బ్యాగ్స్ నీలం, ముదురు ఆకుపచ్చ వంటి కలర్స్ ఎంచుకోండి. ఎల్లో కలర్ వంటి లేత రంగులు అయితే తొందరగా పాతగా అవుతాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. బెడ్ లా.. ఇంకోకటి క్యారియర్ లా ఉంటాయి.
స్లీపింగ్ బ్యాగ్ లాభాలు ఏంటి..?
కామన్ పిల్లలు ఎక్కువగా బొర్లుతారు. కాగా పిల్లలు ఒంటిపై దుప్పట్లు ఉంచుకోరు. దీంతో వెచ్చగా ఉండటానికి చిన్నపిల్లలకు స్లీపింగ్ బ్యాగ్ అయితేనే బెటర్. పిల్లల్ని స్లీపింగ్ బ్యాగ్ లో పడుకోబెట్టి జిప్ పెట్టేస్తే హాయిగా నిద్రస్తారు. పదే పదే దుప్పటి కప్పే పని ఉండదు. ఉయ్యాలలో పడుకోబెట్టి తర్వాత బెడ్ పైకి తీసుకురావడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే స్లీపింగ్ బ్యాగ్‌ను సులభంగా ఉతకవచ్చు. దుప్పట్లలా కాకుండా తొందరగా ఆరిపోతాయి. వాతావరణం చల్లగా ఉన్నా పిల్లల్ని స్లీపింగ్ బ్యాగ్ లో పడుకోబెట్టి.. జిప్ పెడితే వెచ్చగా ఉంటుంది. పిల్లలకు హత్తుకుని ఉన్నట్లు ఉంటుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.