Sitaphal Rabdi: సీతాఫలంతో స్వీట్ రబ్డీ తయారీ విధానం..!!

సీతాఫలం చాలా స్వీ‌ట్‌గా ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌ సి, ఫాస్పరస్‌, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి.

Update: 2024-10-16 15:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీతాఫలం చాలా స్వీ‌ట్‌గా ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌ సి, ఫాస్పరస్‌, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి ఈ పండుకు అధికంగా ఉంటుంది. సీతాఫలంలో ఉండే మెగ్నీషియం శరీరంలోని బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యాన్ని ఉంచుతుంది. క్రీమీ గుజ్జుతో కూడిన ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అయితే ఇన్ని ప్రయోజనాలున్న సీతాఫలంతో స్వీట్ రెసిపీ సీతాఫల్ రబ్డీ చేస్తే రుచి అదిరి పోతుంది. ప్రస్తుత రోజుల్లో ఏ కార్యక్రమాల్లో అయినా రబ్డీ తప్పక ఉండాల్సిందే. కాగా ఈ సింపుల్ రెసిపీ తయారీ విధానం ఎలాగో చూద్దాం..

సీతాఫల్ రబ్డీ కోసం కావాల్సిన పదార్థాలు..

1 లీటర్ పాలు తీసుకోవాలి. 1/4 కప్పు బెల్లం, 1 సీతాఫలం గుజ్జు, 1/2 టీస్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి. గార్నిష్ కోసం పిస్తా తరుగు, సిల్వర్ పూత రేకు, గులాబీ రేకులు, కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకోవాలి.

సీతాఫల్ రబ్డీ తయారీ విధానం..

ఫస్ట్ పాలను ఒక గిన్నెలో పోసి మరిగించాలి. సగానికి ఇంకిపోయి, చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో యాలకుల పొడి, పంచదార లేదా బెల్లం, సీతాఫలం గుజ్జు వేసి కలపండి. ఈ మిశ్రమం అంతా కరిగాక.. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారక అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు అలాగే పిస్తా పప్పులు, గులాబీ రేకులు, సిల్వర్ వార్క్‌తో గార్నిష్ చేసుకోవాలి. అంతే సీతాఫల్ రబ్డీ తయారైపోయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News